Breaking News

డైరెక్టర్ శ్రీను వైట్లకి పితృ వియోగం


టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకి పితృ వియోగం క‌లిగింది. తండ్రి కృష్ణారావు వ‌య‌సు 83 ఏళ్లు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కందుల‌పాలెంలో ఉంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు శ్రీనువైట్ల‌ను ఫోన్‌లో ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం శ్రీనువైట్ల విష్ణు మంచుతో ఢీ అంటే ఢీ అనే సినిమాను చేయ‌డానికి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. దర్శకుడిగా శ్రీనువైట్ల ఇండస్ట్రీలోని చిరంజీవి, మహేశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాలకు ఢీ, రెడీ, దూకుడు వంటి సినిమాలతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. తర్వాత చాలా మంది దర్శకులు ఆయన్ని ఫాలో అయ్యారు. అయితే ఆగడు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శ్రీనువైట్లకి దర్శకుడిగా అనుకున్న మేరకు సినిమాలు రాలేదు. దీంతో ఆయనకు కాస్త గ్యాప్ వచ్చింది. మరోసారి విష్ణు మంచుతో ఢీ అంటే ఢీ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నానని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను హీరోయిన్‌గా కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వపన్ కళ్యాణ్‌ బాడీ లాంగ్వేజ్‌కి అయితే తను దర్శకుడిగా సూట్ అవుతానని ఆయనతో ఇంటర్వ్యూ చేయాలనుందని కూడా సదరు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటి నుంచి పారిపోయి సినిమా రంగానికి వచ్చింది. ఇక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి శ్రీనువైట్ల తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన ప్రేమ వివాహం గురించి కూడా తెలియజేశారు. నాన్నతో మంచి అనుబంధం ఉన్న కారణంగానే తన సినిమాలో తండ్రి సెంటిమెంట్‌ను చూపిస్తుంటానని తెలిపారాయన. డైరెక్టర్‌గా మారి చేసిన తొలి చిత్రం నీ కోసం సినిమాను చూసిన రామోజీరావు సినిమాను ఔట్ రేట్‌కు కొని విడుదల చేయడమే కాకుండా ఆనందం సినిమా డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారని.. దర్శకుడిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయన అందించిన సపోర్టే కారణమని తెలిపారు శ్రీనువైట్ల. ఢీ అంటే ఢీ సినిమాను పూర్తి చేసిన తర్వాత తన వద్ద ఉన్న కథలతో హీరోలను కలిసి తదుపరి సినిమా కోసం ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


By November 28, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-srinu-vaitla-father-krishna-rao-passed-away/articleshow/87957383.cms

No comments