Breaking News

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద RRR వీర నాటు డాన్స్ .. హెల్మెట్ వేసుకుని దుమ్ము రేపిన యువకుడు..వాడే వీడంటూ నెటిజ‌న్స్ కౌంట‌ర్‌!


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం RRR. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కూడా జ‌క్క‌న్న అండ్ టీమ్ స్టార్ట్ చేసేశాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ప్రోమోస్‌, రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘నాటు నాటు వీర నాటు..’ అనే మాస్ బీట్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి వేసిన స్టెప్పుల్లో కొన్నింటిని చూడొచ్చు. అస‌లే ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి స్టెప్పులేసిన ఈ పాట‌కు అభిమానులు వ‌య‌సు బేదం లేకుండా స్టెప్పులేసి మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా ఓ బామ కూడా స్టెప్పులేసి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఓ యువకుడు మరోలా త‌న వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఏకంగా ఓ ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద వాహ‌నాలు నిలిచి ఉంటే హెల్మెట్ వేసుకున్న ఓ యువ‌కుడు బైక్ నుంచి దిగి నాటు నాటు వీర నాటు పాట‌కు డాన్స్ వేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ డాన్స్ చూసిన నెటిజ‌న్స్ హెల్మెట్ తీసి డాన్స్ వేసుంటే ఇంకా బావుండేది క‌దా, మంచి గుర్తింపు వ‌చ్చి ఉండేది అని అంటే, కొంద‌రేమో.. ఇలా హెల్మెట్ వేసుకుని గ‌తంలో అల వైకుంఠ‌పురములో సినిమాల్లోని రాములో రాముల సినిమా కూడా ఇలాగే డాన్స్ చేశాడ‌ని అత‌నే ఇత‌ను అని అంటున్నారు. అయితే స‌ద‌రు యువ‌కుడు డాన్స్ చేసిన సిగ్న‌ల్ మాత్రం ఎక్క‌డుందో ఎవ‌రూ చెప్పలేదు. కొంద‌రు ముంబై అంటే కొంద‌రు హైద‌రాబాద్ అని అంటున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు స్వాతంత్య్ర యోధులు క‌లుసుకుని బ్రిటీష్‌వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నేదే క‌థాంశం. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ ఈ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. డివివి దానయ్య సినిమాను నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు.


By November 15, 2021 at 09:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fan-dance-for-rrr-naatu-naatu-song/articleshow/87708438.cms

No comments