Breaking News

Ravi Teja : లాయర్ల చుట్టూ తిరుగుతున్న రవితేజ.. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మాస్ రాజా!


అభిమానులు మాస్ మ‌హారాజా అని ఎంతో ప్రేమ‌గా పిలుచుకునే ర‌వితేజ వ‌రుస సినిమాలను పూర్తి చేస్తూ ఒక‌వైపు.. మ‌రో వైపు కొత్త సినిమాల‌కు ఓకే చెబుతూ రాకెట్‌లా దూసుకెళ్లిపోతున్నాడు. ఆయ‌న స్పీడు చూసి ఇత‌ర హీరోలంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు కూడా. ఇంత స్పీడుమీదున్న ర‌వితేజ ఓ విషయాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ట‌. ఎంత సీరియ‌స్‌గా అంటే దాని కోసం లాయ‌ర్ల చుట్లూ తిరగ‌డానికి కూడా వెనకాడ‌టం లేద‌ట‌. ఇంత‌కీ ర‌వితేజ ఏ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నాడు.. ఎందుకు లాయ‌ర్ల చుట్లూ తిరుగుతున్నాడంటే? ఓ క్యారెక్ట‌ర్ కోసం. సాధార‌ణంగా డైరెక్టర్స్ చెప్పింది ఫాలో అయిపోయే ర‌వితేజ తాజాగా చేయ‌బోతున్న రావ‌ణాసుర సినిమా స్టైల్ మార్చాడు. ఈ సినిమాలో ర‌వితేజ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. దీని కోసం ఆయ‌న త‌న స్టైల్ మార్చేశాడు. అస‌లు లాయ‌ర్స్ ఎలా బిహేవ్ చేస్తారు. కేసు స‌మ‌యంలో ఎలా వాదిస్తారు? వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విష‌యాల‌ను ఇద్ద‌రు లాయ‌ర్స్ ద‌గ్గ‌ర మ‌రీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట‌. కోర్టు వాద‌న‌ల‌కు సంబంధించిన సెక్ష‌న్స్‌ను నేర్చుకుంటున్నాడ‌ట‌. కోర్టుల రెఫ‌రెన్స్‌ల‌ను తీసుకుంట‌న్నాడ‌ట‌. రావ‌ణాసుర సినిమాను సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గానే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. టైట‌ల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇందులో ప‌ది త‌ల‌ల రావ‌ణాసురుడి స్టైల్లో ర‌వితేజ క‌నిపిస్తుండ‌టం విశేషం. ర‌వితేజ పాత్ర‌ను ఇలా డిఫ‌రెంట్‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అయితే ఈ సినిమా కోసం ర‌వితేజ ఇంత హార్డ్ వ‌ర్క్ చేస్తుండ‌టంపై మేక‌ర్స్‌కు ఎంతో సంతోష‌ప‌డిపోతున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ టైటిల్ పోస్టర్ చూస్తుంటే రవితేజను మరో కోణంలో దర్శకుడు సుధీర్ వర్మ ఆవిష్కరించబోతున్నారని అర్థమవుతుంది. అలాగే సినిమాతో నిర్మాత‌గా మారుతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ అనే పేరుంది. అంటే ఇది ర‌వితేజ టీమ్ వ‌ర్క్స్ అనే నెటిజ‌న్స్ భావిస్తున్నారు. మ‌రి రవితేజ త‌న సినిమాల‌కు మాత్ర‌మే నిర్మాత‌గా ఉంటారా? లేక వేరే టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తాడా? అనేది చూడాలి. ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ర‌వితేజ‌, మ‌రోవైపు ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసి కమ‌ర్షియ‌ల్ స్టార్ హీరో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ‘ధ‌మాకా’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.


By November 16, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-playing-as-lawyer-in-ravanasura/articleshow/87727533.cms

No comments