Breaking News

Puneeth Rajkumar: పునీత్ మ‌ర‌ణాన్ని క్యాష్ చేసుకుంటున్న రాబందులు.. ఫ్యాన్స్ ఆగ్ర‌హం


మ‌ర‌ణాన్ని కొంద‌రు రాబందుల్లా మారి డ‌బ్బులు దండుకునే ప‌నిలో ప‌డ్డారా? అవును నిజ‌మే! అని అంటారు ఓ ఫొటోను చూస్తే.. ఇంత‌కీ ఆ పొటోలో ఏముంది? అనే వివ‌రాల్లోకెళ్తే.. స‌మాజంలో కొన్ని సంద‌ర్భాల్లో మ‌న చుట్టూ జ‌రుగుతున్న విష‌యాల‌ను గ‌మ‌నిస్తే .. అస‌లు మ‌నం ఎటు వెళుతున్నాం. మ‌నిషి ఆలోచ‌న‌లు ఎటు వెళుతున్నాయ‌నే బాధ పెరిగిపోతుంది. రీసెంట్‌గా ఇలాంటి ప‌రిణామాన్ని చూస్తే నిజ‌మ‌నిపించ‌క త‌ప్పదు. కొన్ని రోజుల ముందు క‌న్న‌డ అగ్ర క‌థానాయ‌కుడు ప‌నీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో అకాల మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. రీల్ హీరోగానే కాదు, రియ‌ల్ హీరోగానూ ఆయ‌న ఎన్నో సేవ‌లు చేశారు. ప్రజలు, అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ పునీత్ రాజ్ కుమార్ మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. నిజానికి రెగ్యుల‌ర్‌గా జిమ్ చేస్తూ ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ రాజ్‌కుమార్.. జిమ్‌లో ఎక్స‌ర్ సైజు చేస్తుండ‌గా ఆయ‌న ఇబ్బందిగా అనిపించ‌డం. కుటుంబ స‌భ్యులు స‌కాలంలో స్పందించి ఆయ‌న్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. పునీత్ రాజ్‌కుమార్ చ‌నిపోయిన రోజు జ‌రిగిన ప‌రిస్థితులు చూస్తే ఎవ‌రికైనా మ‌న‌సులో తెలియని ఓ భ‌యం వ‌స్తుంది. ఫిట్‌గా ఉన్న వ్య‌క్తి ఇలా అయిపోయాడేంటి? అని. ఈ భ‌యాన్ని కొంద‌రు రాబందుల్లా మారి క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏంటి సామాన్యుడి భ‌యాన్ని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? అంటే ఈ ఫొటో చూస్తే మాత్రం మీరు నిజ‌మ‌ని న‌మ్మ‌క త‌ప్ప‌దు. బెంగుళూరులో ఓ డ‌యాగ్న‌స్టిక్స్ సంస్థ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మ‌ర‌ణించ‌డంపై సంతాపాన్ని తెలియ‌జేస్తూనే ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు ఉచితంగా అంద‌రికీ గుండె, ఇత‌ర చెకప్స్‌ను ఉచితంగా చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దాని కింద గ‌మ‌నిస్తే.. మా వ‌ద్ద‌కు మీరు బీపీ. ఈసీజీ, క్రెటిన్ లైన్‌, కొల‌స్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవ‌లం మూడు వంద‌ల రూపాయ‌లు మాత్ర‌మే చెల్లిస్తామ‌ని ప్ర‌క‌ట‌న సైలెంట్‌గా యాడ్ చేసేసింది. నిజానికి సద‌రు సంస్థ ఓ మంచి ప‌నిని చేస్తూ, దాన్నే త‌మ స్వ‌లాభం కోసం మార్చుకున్న‌ట్లు ఈ ఫొటో చూస్తే అర్థం కావ‌డం లేదా? మ‌నిషి డ‌బ్బు కోసం ఎలా ఆలోచిస్తున్నాడో అని బాధ వేయ‌డం లేదా? ఇలాంటి చ‌ర్య‌ల‌పై పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఎదుటి వ్య‌క్తి చావును మ‌న‌కు లాభంగా మార్చుకుంటే వారిని రాబందులు కాకుండా ఏమ‌నాలంటున్నారు. నిజంగా ఈ చ‌ర్య హేయ‌నీయం. చ‌నిపోయిన వ్య‌క్తిని దేవుడుతో పోల్చుతాం. గౌర‌వం ఇస్తాం. అలాంటి వ్య‌క్తి చావును ఇలా చేయ‌డం స‌రికాదంటున్నారు ఫ్యాన్స్‌.


By November 06, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/diagnostic-centres-making-money-on-punneth-rajkumar-death/articleshow/87548661.cms

No comments