Breaking News

యూపీలో విజృంభిస్తోన్న జికా వైరస్.. ఒక్క రోజే 30 మందికి పాజిటివ్!


ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క రోజే కాన్పుర్‌లో 30 మందికి ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయింది. దీంతో కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 66కి పెరిగింది. వైరస్‌ బారినపడ్డవారిలో 45 మంది పురుషులు, 21 మంది మహిళలున్నారు. జికా బాధితుల్లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కి చెందిన 9 మంది సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. కాన్పుర్‌లో అక్టోబరు 23న తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది. ఐఏఎఫ్‌ వారెంట్‌ ఆఫీసర్‌ ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైమానిక దళ ప్రాంగణానికి సమీప ప్రాంతాల్లో పలువురి నుంచి నమూనాలను సేకరించినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. జికా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ‘జికా’ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. దోమల ద్వారా సంక్రమిస్తుందని, కీటకాలను వదిలించుకోవడమే వ్యాధి నుంచి సురక్షితమైన మార్గమని కాన్పూర్ కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు నిఘా పెంచాలని, ఇంటింటికీ వెళ్లి నమూనాలను సేకరించి, వ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ IAF స్టేషన్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా హై అలర్ట్‌లో ఉంచారు. ‘బుధవారం 400 నుంచి 500 మంది నమూనాలను సేకరించి పరీక్షించగా 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది’ అన్నారు. జికా బాధితులకు చికిత్సలో ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను వినియోగిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో ఔషధాలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో అమెరికా ఫార్మా ‘మెర్క్’ ముందడుగు వేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ మాత్రను బ్రిటన్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనిపై వచ్చేవారం సమీక్షించనుంది. జికా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుందని, కీటకాలను వదిలించుకోవడమే వ్యాధి నుంచి సురక్షితమైన మార్గమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు నిఘా పెంచాలని మరియు డోర్ టు డోర్ శాంపిలింగ్ మరియు వ్యాధికి సంబంధించిన పరీక్షలను నిర్ధారించాలని ఆదేశించినప్పటికీ, IAF స్టేషన్ల హ్యాంగర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా హై అలర్ట్‌లో ఉంచారు.


By November 06, 2021 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/zika-virus-outbreak-in-up-30-more-test-positive-as-caseload-reaches-66-in-kanpur/articleshow/87548389.cms

No comments