Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య
ప్రేక్షకాభిమానులను శోక సంద్రంలో ముంచి దూరమైన కన్నడ పవర్‌స్టార్ సమాధిని శుక్రవారం రోజున హీరో సందర్శించారు. తన సినిమా రిలీజ్‌తో తలమునకలై ఉన్న కారణమో ఏమో కానీ.. పునీత్ మరణించినప్పుడు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించలేకపోయారు హీరో సూర్య. శుక్రవారం ఆయన బెంగుళూరు వెళ్లి, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శివరాజ్‌కుమార్ వెంటరాగా, పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్దకు వెళ్లారు. సమాధికి పూల మాల వేసి నివాళులు అర్పించిన సూర్య బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు మౌనం ఘటించి తిరిగి వచ్చేశారు. సూర్య ఎమోషనల్ అయ్యి, కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల ముందు కన్నడ అగ్ర కథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు తమిళ హీరోలెవరూ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్లలేదు. దీనిపై పెద్దగా విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత హీరో విశాల్ పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల చదువు ఖర్చుని వచ్చే ఏడాది తాను చూసుకుంటానని అన్నారు. ఇప్పుడు హీరో సూర్య బెంగుళూరు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. రీసెంట్‌గా టాలీవుడ్‌కి స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, సోదరుడు శివ రాజ్‌కుమార్ బాటలో సినీ రంగంలోకి అడుగు పెట్టిన పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తన మార్క్ క్రియేట్ చేసుకుని పవర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు. హీరోగానే కాకుండా నిజ జీవితంలో ఎందరికో అండగా నిలుస్తూ రియల్ హీరోగా మారారు. అందుకనే ఆయన మరణం సినీ, రాజకీయ వర్గాలకు దిగ్భ్రాంతిని కలిగించాయి. అన్ని సినీ పరిశ్రమలకు చెందిన హీరోలతో పునీత్‌కు సత్సంబంధాలున్నాయి. బెంగుళూరుకి ఎవరైనా హీరోలు వెళ్లినప్పుడు పునీత్ వెళ్లి వారితో ప్రత్యేకంగా ముచ్చటించేవారు. అంతటి స్నేహశీలి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి.
By November 05, 2021 at 12:55PM
No comments