Pawan Kalyan : ముందు బాటిల్ పెట్టుకుని మరీ.. భీమ్లా నాయక్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే దీపాావళి గిఫ్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. పవన్ రీ ఎంట్రీ తర్వాత జోరు పెంచిన పవన్ చేస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ ఒకటి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ప్రతి ఎలిమెంట్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ ఎక్కించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినవే. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ టీజర్, రానా టీజర్, రెండు పాటలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ ఊపుకు మరింత కిక్‌ను అందిస్తూ దీపావళి పండుగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. హీరో పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని తెలియజేస్తూ విడుదలైన టీజర్‌లో లాలా భీమ్లా.. అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వినే ఉంటారు. ఆ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా దర్శక నిర్మాతలు ప్రకటించారు. వీడియో ప్రోమో కాబట్టి ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసేయడం పక్కా అని సినీ వర్గాలు అంటున్నాయి. నిజంగానే ఈ దీపావళికి పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. భీమ్లానాయక్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్గానారు. కాగా.. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రముఖ దర్శకుడు, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఒకానొక దశలో ఆర్ఆర్ఆర్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని కూడా న్యూస్ వచ్చింది. అయితే ఈ వార్తలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. ప్రకటించినట్లే జనవరి 12న సంక్రాంతికి వస్తున్నామన్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మరికొందరు దర్శకులు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
By November 03, 2021 at 11:31AM
No comments