Akhanda: దీపావళికి బాలయ్య బాబు గర్జన.. 'అఖండ' క్రేజీ అప్‌డేట్
నందమూరి నటసింహం , మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ''. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చినా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల నడుమ దీపావళికి బాలయ్య బాబు గర్జన ఉంటుందని తెలియడం నందమూరి అభిమానులను హుషారెత్తిస్తోంది. షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ సాంగ్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నవంబర్ 4వ తేదీ ఉదయం 11:43 గంటలకు ఈ సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు. నవంబర్ 8న ఫుల్ సాంగ్‌ను లిరికల్ వీడియోగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పారు. అదేవిధంగా చిత్ర పనులన్నీ చకచకా కంప్లీట్ చేసి డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలో బోయపాటి- బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ''సింహా, లెజెండ్'' చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. ఈ హాట్రిక్ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి.
By November 03, 2021 at 11:54AM
No comments