Breaking News

Maharashtra మనీ ల్యాండరింగ్ కేసు.. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్


మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్ట్ చేసింది. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఆయనను సోమవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌ అంశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ చుక్కెదురయ్యింది. అయితే, ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు మహారాష్ట్రను కుదిపేశాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమనీ ఆయన పేర్కొన్నారు. అయితే అనిల్‌ దేశ్‌ముఖ్‌ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. ఇక, అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి పరంబీర్ సింగ్‌పై కూడా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనపై కూడా పలు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పరంబీర్ పరారీలో ఉన్నారు.


By November 02, 2021 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtras-former-home-minister-anil-deshmukh-arrested-in-money-laundering-case/articleshow/87477478.cms

No comments