Jai Bhim : సూర్యను టార్గెట్ చేసిన బీజేపీ.. విమర్శనాత్మక ట్వీట్‌ను లైక్ చేసిన హీరో
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. సినిమాలు, సామాజిక సేవ అంటూ ముందుకెళుతున్న ఈ హీరో ఇప్పుడు జాతీయ పార్టీకి టార్గెట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నీట్ ఎగ్జామ్స్‌కు, తమిళనాడులో హిందీని తప్పనిసరి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన రూల్స్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తినప్పటి నుంచి హీరో సూర్య బీజేపీకి వ్యతిరేకిగా మారారు. ఆ పార్టీ నాయకులు సూర్యను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన సినిమా జై భీమ్ విషయంలోనూ తమిళనాడుకి చెందిన బీజేపీకి చెందిన జాతీయ కార్యదర్శి హెచ్.రాజా.. హీరో సూర్యను టార్గెట్ చేశారు. విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. మాకు మూడు భాషలు అక్కర్లేదంటూ మాట్లాడిన హీరో సూర్య ఇప్పుడు తన జై భీమ్ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసుకున్నారు’’ అంటూ సూర్యను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. సూర్య స్వార్థపరుడు అంటూ ఈ సందర్భంగా రాజా విమర్శలు చేశారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. దీనికి సంబంధించిన ట్వీట్‌ను హీరో సూర్య లైక్ చేశారు. హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘జై భీమ్’. సామాజిక అసమానతలు గురించి ప్రస్తావిస్తూ, పేదల పక్షాన రూపాయి ఫీజు తీసుకోకుండా పోరాడిన రియల్ హీరో లాయర్ చంద్రు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. తమిళనాడు కడలూరులో జరిగిన ఓ యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని జై భీమ సినిమాను రూపొందించారు. ఆకాశం నీ హద్దురా తర్వాత స్ట్రయిట్‌గా ఓటీటీలోనే విడుదలైన సూర్య సినిమా ఇది. ఆకాశం నీ హద్దురాకు ఎంతటి ప్రశంసలు వచ్చాయో అంతేలా ఈ సినిమా ఆకట్టుకుంది. దీంతో, సూర్యకు ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ అనేది ఎంతో బాగా కలిసొచ్చిందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మరోవైపు సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఎదుక్కు తునింజాదవన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది థియేటర్స్‌లోనే విడుదలయ్యే అవకాశలున్నాయని టాక్.
By November 05, 2021 at 10:07AM
No comments