Breaking News

HIV మిరాకిల్.. ఎయిడ్స్‌ను జయించిన 30 ఏళ్ల మహిళ!


2013లో ఎయిడ్స్‌ నిర్దారణ అయిన అర్జెంటీనా మహిళలో తాజాగా హెచ్‌ఐవీ లక్షణాలు అదృశ్యం కావడం పరిశోధకులను విస్మయానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీతో శాశ్వతంగా పోరాడుతున్న వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు కావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పెరాన్జా నగరానికి చెందిన నిర్ధారణ అయిన మహిళ (30) వైద్య పరంగా ‘ఎలైట్ కంట్రోలర్’ లక్షణాలను కలిగి ఉంది. చికిత్స కోసం శక్తివంతమైన ఔషధాలను తీసుకోవడం ఆపివేసిన తర్వాత కూడా ఆమెలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌‌లో ప్రచురించిన అధ్యయనంలో తెలిపారు. ‘విస్తృతమైన పరీక్షలో ఎక్కడా ప్రొవైరస్‌గా పిలిచే హెచ్ఐవీ ఆమె DNAలో కలిసినట్లు బయటపడలేదు.. దీనిని వైద్య పరిభాషలో ‘స్టెరిలైజింగ్ క్యూర్’అంటారు.. అంటే ఆమె ఇకపై వైరస్ ప్రతిరూపం దీర్ఘకాలికంగా ఆమెలో ఉండదు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా ఉందని పేర్కొన్నారు. గతంలో బ్లడ్ క్యాన్సర్‌కు కణజాల మార్పిడి చికిత్స తీసుకున్న ఇద్దరు HIV రోగులు ఎయిడ్స్‌ను జయించారు. ఈ ఇద్దరిలోనూ విస్తృతమైన కేన్సర్ చికిత్స తర్వాత హెచ్‌ఐవీ నెగెటివ్ వచ్చింది. ప్రస్తుత కేసులో ఆమె వైరస్‌ను ఎలా జయించారనే అంశంపై పరిశోధకులు స్పష్టమైన సమాధనం ఇవ్వనప్పటికీ అది సాధ్యమేనని సూచిస్తున్నారు. ‘రక్తం, కణజాలాల నుంచి భారీ సంఖ్యలో కణాలను విశ్లేషించినప్పటికీ, ఎలైట్ కంట్రోలర్‌లో వైరస్ ఆనవాళ్లు లేవు.. ఈ రోగి సహజంగానే HIV-1 ఇన్ఫెక్షన్‌ స్టెరిలైజింగ్ క్యూర్’ సూచిస్తున్నాయి’ అని బోస్టన్ రాగన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జు యు నేతృత్వంలోని పరిశోధకులు తెలిపారు. బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ రెట్రోవైరస్ అండ్ ఎయిడ్స్‌కు చెందిన నటాలియా లూఫర్‌తో కలిసి ఈ పరిశోధనలు సాగించారు. ‘HIV-1 స్టెరిలైజింగ్ క్యూర్ చాలా అరుదైన కానీ సాధ్యమేనని ఈ పరిశీలన నిరూపించింది’ ఎయిడ్స్ రోగులలో వైరస్‌ను నిర్మూలించేందుకు వైద్యులు దశాబ్దాలుగా విఫలయత్నం చేస్తున్నారు. కాంబినేషన్ డ్రగ్ థెరపీ ద్వారా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రయత్నాలు చేసినా.. చికిత్స ఆపివేసిన తర్వాత మళ్లీ హెచ్ఐవీ తిరగబెడుతోంది. తాజా కేసులో వైరస్ లక్షణాలు పూర్తిగా నయం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్ నిర్మూలనకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ‘ఆమె ప్రారంభ రోగనిరోధక ప్రతిస్పందన అబార్టివ్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంది లేదా రోగనిరోధక వ్యవస్థ కాలక్రమేణా వైరస్‌ను గుర్తించి నాశనం చేయడంలో మెరుగ్గా మారింది.. హెచ్‌ఐవీ అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అని మెల్‌బోర్న్ యూనివర్సిటీ పీటర్ డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ కో-ఆథర్ షారన్ లెవిన్ అన్నారు. ‘ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇది నివారణకు మరొక మార్గం’ అని లెవిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, 2017 జులైలో ఎయిడ్స్‌తో మరణించిన ‘బెర్లిన్ రోగి తిమోతీ బ్రౌన్’ని పోలి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తిమోతీ బ్రౌన్ దాదాపు 15 సంవత్సరాల కిందట లుకేమియాకు కణజాల చికిత్సను చేయించుకున్న తర్వాత అతడిలో HIV నెగెటివ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 8 కోట్ల మందికిపైగా ఎయిడ్స్ బారినపడగా.. 3.63 కోట్ల మంది చనిపోయారు. 2020 నాటికి 37.7 కోట్ల మంది బాధితులున్నారు. గతేడాదిలో ఏకంగా 1.5 మిలియన్ల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.


By November 23, 2021 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/30-year-old-argentina-woman-whose-hiv-vanished-gives-hope-for-aids-cure/articleshow/87864819.cms

No comments