Breaking News

God Father: చిరంజీవితో నయనతార రొమాన్స్.. గాడ్ ఫాదర్‌లో లేడీ సూపర్ స్టార్ రోల్ ఇదే..


సౌత్ ఇండియా సూపర్ స్టార్ మరోసారి మెగాస్టార్ చిరంజీవితో తెరపంచుకోనుంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిరు సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ మెగాస్టార్ చెంత చేరుతోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తన 153 సినిమాగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నయనతారను కన్ఫర్మ్ చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులతో ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దిన డైరెక్టర్ మోహన్ రాజా.. క్యాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. బడా తారలతో సినిమా గ్రాండ్‌గా రావాలని భావిస్తున్న ఆయన.. ఈ సినిమాలోని ముఖ్యమంత్రి కూతురి పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆమె పుట్టినరోజు కానుకగా మెగా అభిమానులకు ఈ వార్త చెప్పారు. నయన్ తమ సినిమాలో భాగం కానుంది అని పేర్కొంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన రోల్ నయన్ చేయనుందట. విభిన్నమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌ బాణీలు కడుతుండగా.. నీరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా గంగవ్వను తీసుకోవడం మరో విశేషం. అలాగే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను భాగం చేస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


By November 19, 2021 at 06:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/official-nayanthara-confirmed-as-heroine-in-chiranjeevis-god-father/articleshow/87790714.cms

No comments