Breaking News

Ghani : ‘గ‌ని’ టీజ‌ర్ రివ్యూ...గెలిస్తేనే చ‌రిత్ర .. అదే స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘గ‌ని’ టీజ‌ర్ విడుద‌ల‌


వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సోమవారం గని మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డ‌మే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా అయ్యింది. ప్ర‌తి ఒక్క‌డి క‌థ‌లో క‌ష్టాలు క‌న్నీళ్లు ఉంటాయి. కోరిక‌లుంటాయి.. కోపాలుంటాయి..కనపడితే గొడవలుంటాయి అలాగే ఇక్క‌డున్న ప్ర‌తి ఒక్క‌డికీ చాంపియ‌న్ అయిపోవాల‌న్న ఆశ ఉంటుంది కానీ విజేతగా నిలిచేది ఒక్క‌డే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుక‌వ్వాలి.. వై యు.. ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు. కానీ గెలిస్తే మాత్ర‌మే చ‌రిత్ర‌లో ఉంటావు అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ రామ్‌చ‌ర‌ణ్ బ్యాగ్రౌండ్‌లో వ‌స్తుంటే.. మ‌రో వైపు గ‌ని సినిమాకు సంబంధించిన కొన్ని షాట్స్‌ను క‌ట్ చేసి వేయ‌డాన్ని చూడొచ్చు. టీజ‌ర్‌లో వ‌రుణ్ తేజ్ త‌ల్లి పాత్ర‌లో న‌దియా క‌న‌ప‌డ‌నుంద‌ని తెలుస్తుంది. సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తిబాబు, సీనియ‌ర్ న‌రేశ్‌, న‌వీన్ చంద్ర పాత్ర‌ల‌తో పాటు హీరోయిన్‌గా న‌టించిన స‌యీ మంజ్రేక‌ర్ పాత్రను కూడా టీజ‌ర్‌లో చూపించారు. ఇది వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ పంచ్‌, టైటిల్ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట‌జ‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను డిసెంబ‌ర్ 24గా ప్ర‌క‌టించారు. నిజానికి ముందు డిసెంబ‌ర్ 3న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న రాబోతున్నారు. ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అమెరికా వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాడు. 8 ప్యాక్ లుక్లో వరున్ మెగాభిమానులను అలరించబోతున్నాడు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతుంది. . మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


By November 15, 2021 at 12:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-ghani-teaser-released/articleshow/87711582.cms

No comments