Breaking News

Drushyam 2 :నిర్మాత డి.సురేశ్ ‌బాబుకి షాక్... లీగల్ చర్యలకు సిద్ధమైన ఓటీటీ సంస్థ?


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబుకి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ షాక్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యిందనే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. అస‌లు ఏమైంది? అనే వివ‌రాల్లోకి వెళితే, వెంక‌టేశ్ హీరోగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం దృశ్యం 2. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన దృశ్యం 2కు ఇది రీమేక్‌. నవంబర్ 25న ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ను కూడా నిర్వ‌హించారు. అంతా బాగానే ఉంది అనుకున్న త‌రుణంలో విష‌యంలో నిర్మాత డి.సురేశ్‌బాబుకి లీగ‌ల్ స‌మ‌స్య‌లు రాబోతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ సురేశ్‌బాబుపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోబోతుంద‌ని టాక్. ఎందుకంటే.. దృశ్యం 2 సినిమాను ముందుగా డీస్నీ హాట్‌స్టార్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత డి.సురేశ్‌బాబు ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ట‌. కానీ అమెజాన్ ప్రైమ్ సంస్థ రెండు కోట్లు ఎక్కువ ఇస్తామ‌ని డీల్‌తో ముందుకు వ‌చ్చింద‌ని, దాంతో సురేశ్‌బాబు త‌న దృశ్యం 2 సినిమా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ హ‌క్కుల‌ను అమెజాన్‌కు ఇచ్చేశార‌ని.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న డిస్నీ హాట్‌స్టార్ ప్ర‌తినిధులు సురేశ్‌బాబుపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోబోతున్నార‌ని కూడా న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై ఇటు డిస్నీ హాట్ స్టార్ ప్ర‌తినిధులు కానీ, అటు సురేశ్ బాబుకి సంబంధించిన వారు మాత్రం స్పందించ‌డం లేదు. ఇదేమైన సినిమా విడుద‌ల‌కు అడ్డంకిగా మారుతుందేమో చూడాలి. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన దృశ్యం చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ప్ర‌ధానాంశం. ఆ సినిమా తెలుగు రీమేక్‌ను శ్రీప్రియ అప్ప‌ట్లో డైరెక్ట్ చేశారు. త‌ర్వాత దృశ్యం 2 రూపొందింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుద‌ల చేశారు. సినిమాకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో తెలుగులో రీమేక్ చేశారు. వెంక‌టేశ్ హీరోగానే చేశారు. అయితే ఈసారి తెలుగు వెర్ష‌న్‌ను శ్రీప్రియ స్థానంలో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. ఎప్పుడో ఈ సినిమా సిద్ధ‌మైంది. అయితే క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. దీంతో దృశ్యం 2ను థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. నిర్ణ‌యం అయిపోయిన త‌ర్వాత థియేట‌ర్స్ ఓపెన్ అయిన‌ప్ప‌టికీ దృశ్యం 2 తెలుగు వెర్ష‌న్‌ను అమెజాన్‌లోనే విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు డిసైడ్ అయిపోయారు.


By November 21, 2021 at 10:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/disneyhotstar-take-leagal-action-on-producer-suresh-babu-on-drushyam-2-release/articleshow/87827739.cms

No comments