Breaking News

Degala Babji: డేగల బాబ్జీ ట్రైలర్.. ఈశ్వర.. పరమేశ్వర అంటూ బండ్ల గణేష్ విశ్వరూపం


టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా, నిర్మాతగా సత్తా చాటిన .. రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ వేసి వేనక్కు తగ్గారు. ఇక ఇప్పుడు మీరో స్టెప్ తీసుకుంటూ హీరో అవతారమెత్తారు. హీరోగా మరికొద్ది రోజుల్లోనే ''గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచేశారు మేకర్స్. 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో బండ్ల గణేష్ నటనలో ఎంతో పరిణితి కనిపించింది. డిఫరెంట్ కోణాల్లో ఆయన నట విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు. సింగిల్ లొకేషన్, సింగిల్ యాక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకే వ్యక్తి కనబర్చడం తెలుగు సినీ తెరపై ఇదే తొలిసారి అని తెలుపుతూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడైన డేగల బాబ్జీ.. అసలు ఆ హత్యను తానెందుకు చేయాల్సి వచ్చిందో చెప్పడం ఈ సినిమా ప్రధాన కథాంశం. అలా డిఫరెంట్ సన్నివేశాల్లో, డిఫరెంట్ కోణాల్లో బండ్ల గణేష్ ఆకట్టుకున్నారు. దీంతో ఈ ట్రైలర్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్స్, కథకు తగ్గట్లుగా కనబర్చిన ఎమోషన్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ''పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం, అసలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా?'' అంటూ ఆయన చెప్పిన పదునైన డైలాగ్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ సినిమాకి తెలుగు రీమేక్ ఈ డేగల బాబ్జి. యస్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


By November 08, 2021 at 10:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bandla-ganesh-degala-babji-official-trailer-released/articleshow/87578890.cms

No comments