Breaking News

Covid హాట్‌స్పాట్‌గా ధార్వాడ్ మెడికల్ కాలేజీ.. మరో 100 మందికి పాజిటివ్!


కర్ణాటకలోని కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 100 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో అక్కడ రెండు రోజుల్లో కరోనా బారినపడ్డవారి సంఖ్య 281కి చేరింది. దీంతో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో రోగులకు తనిఖీలను నిలిపివేశారు. కొత్తవారిని చికిత్స కోసం చేర్చుకోవడం లేదు. కాలేజీకి సంబంధించిన అన్ని గేట్లను మూసివేశారు. కరోనా నుంచి కోలుకుని, నెగెటివ్ వచ్చిన వ్యక్తులను డిశ్చార్జ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. ధ్వారాడ్ మెడికల్ కాలేజీ ఉత్తర కర్ణాటకలో మెడికల్ హబ్‌గా గుర్తింపు పొందింది. నవంబరు 17న కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీయే కొంపముంచిందని అధికారులు పేర్కొన్నారు. ఆ ఈవెంట్ రెండు మూడు రోజుల కొనసాగడంతో కోవిడ్ వ్యాప్తికి దోహదం చేసిందన్నారు. కోవిడ్-18 క్లస్టర్‌గా మారడం ఆందోళ కలిగిస్తోందని కర్ణాటక కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, మణిపాల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ వ్యాఖ్యానించారు. ‘‘ఫ్రెషర్స్ పార్టీతో ఒక పెద్ద క్లస్టర్‌గా మారింది.. అంటే ఓ వేరియంట్ కారణమై ఉండొచ్చు.. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే విద్యార్థులందరికీ పూర్తిగా టీకాలు వేసినా రోగనిరోధకతను తప్పించుకుని వైరస్ బారినపడటం.. అయితే, చాలా మందికి అంత తీవ్రంగా లేకపోవడం ఊరటనిస్తోంది.. జన్యు విశ్లేషణ కొత్తరకం వేరియంట్‌‌గా నిర్ధారించడానికి సహకరిస్తుంది ’’అని అన్నారు. వైరస్ బారినపడ్డవారిలో కేవలం ఆరుగురికి మాత్రమే కోవిడ్ లక్షణాలు బయటపడటం గమనార్హం. కాలేజీలోని దాదాపు 3,000 వరకు ఉన్న విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ కనీసం 1,000 మందికి నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారి ఫలితాలు రావాల్సి ఉంది.


By November 27, 2021 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/99-more-test-positive-for-covid-in-dharwad-medical-college-in-karnataka/articleshow/87943470.cms

No comments