టమోటా ధర మరో రెండు నెలలు ఇలాగే.. క్రిసిల్ సంచలన నివేదిక
దీపావళి తర్వాత దక్షిణాదిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమోటా సహా కూరగాయల పంట నాశనమైంది. దీంతో టమోటా ధరలు ఎన్నడూలేని విధంగా పెరిగిపోయాయి. దేశంలో టమోటా ధర రూ.67 ఉన్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 63శాతం అధికమని, భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానే ధరలు పెరిగినట్టు తెలియజేసింది. ఉత్తర భారతదేశంలో టమోటాల దిగుబడి డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతాయని, ఈ దిగుబడుల అనంతరం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే, ధరల స్థీకరణ నిధి నుంచి రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్టు కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం వాటా కింద రూ. 164.15 కోట్లు అందించినట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కాగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కర్నూలు మార్కెట్‌కు టమోటా రావడంతో నిన్నటి వరకు కిలో వంద పలికిన టమోటా ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే, మరో రెండు నెలలు ఇలాగే ఉంటాయని తెలిపింది. ఉత్పత్తికి ప్రధాన కేంద్రమైన కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూరగాయలు సరఫరా అవుతున్నాయని పేర్కొంది. కర్ణాటకలో 105 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 40 శాతం, మహారాష్ట్రలో 22 శాతం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని, దీని కారణంగా పంటలు దెబ్బతిన్నాయని చెప్పింది. నవంబరు 25 నాటికి కూరగాయలు ధరలు 142 శాతం మేర పెరిగాయని, మరో రెండు నెలలకుపైగా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జనవరి నుంచి మార్కెట్‌కు పంట వస్తుందని తెలిపింది. కొత్త పంట మార్కెట్‌కు వస్తే ధరలు 30 శాతం వరకు తగ్గుతాయంది. అటు, ఉల్లి ధరలు కూడా సెప్టెంబరుతో పోల్చితే అక్టోబరులో 65 మేర పెరుగుదల ఉందని వివరించింది. లోటు వర్షపాతం వల్ల మహారాష్ట్రలో పంట ఆలస్యమైంది. మరో పది నుంచి పదిహేను రోజుల్లో హరియాణాలో కొత్త పంట వస్తుందని అంచనా వేసింది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయని క్రిసిల్ చెప్పింది. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, బిహార్, గుజరాత్‌లో బంగాళాదుంపల దిగుబడిని భారీ వర్షాలు దెబ్బతీశాయి.
By November 27, 2021 at 10:59AM
No comments