Breaking News

Chiranjeevi : లాంఛ‌నంగా ప్రారంభమైన మెగాస్టార్ ‘భోళా శంకర్’... సైలెంట్‌గా స్నేహితుడికి మెగాస్టార్ స‌పోర్ట్‌!


మెగాస్టార్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భోళా శంక‌ర్‌’. మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌కుడు. చిరంజీవి 155వ చిత్రంగా, గురువారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకాల‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 15 నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తుంది. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత చిరంజీవి, త‌మ‌న్నా క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఈ రోజు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు పాల్గొన్నారు. కొర‌టాల శివ‌, వి.వి.వినాయ‌క్‌, గోపీచంద్ మ‌లినేని, బాబీ, వెంకీ కుడుముల స‌హా ప‌లువురు పాల్గొన్నారు. ద‌ర్శ‌కేంద్రుడు, కె.రాఘ‌వేంద్రావు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డ‌మే కాకుండా దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. కె.రాఘ‌వేంద్ర‌రావు స‌హా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కులంద‌రూ క‌లిసి ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్‌, నిర్మాత అనీల్ సుంక‌ర‌ల‌కు స్క్రిప్ట్‌ను అందించి అభినంద‌న‌లు తెలిపారు. మ‌రోసారి చిరంజీవి త‌న ఫ్రెండ్, నిర్మాత అయిన కె.ఎస్‌.రామారావుకు ఈ సినిమా నిర్మాణ ప‌రంగా హెల్ప్ చేశారు. ఆయ‌న్ని కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిని చేశారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవితో కె.ఎస్‌.రామారావు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. మ‌ధ్య‌లో చాలా గ్యాప్ వ‌చ్చేసింది. అయితే ఎప్ప‌టి నుంచో చిరంజీవితో సినిమా చేయాల‌నుకుంటున్న ఈ సీనియ‌ర్ నిర్మాత కోరిక‌ను మెగాస్టార్ ఇలా తీర్చేశారు. డూడ్లీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత డైరెక్ట్ చేస్తున్న మెహ‌ర్ రమేశ్ ఈ సినిమాను ఎలా తెర‌కెక్కిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఇప్ప‌టికే కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమాను పూర్తి చేసిన చిరంజీవి.. ఇప్పుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే బోళా శంక‌ర్ సినిమా షూటింగ్ షురూ అవుతుంది. మ‌రో వైపు రీసెంట్‌గానే త‌న 154వ చిత్రంగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను స్టార్ట్ చేశారు. ఇలా కుర్ర హీరోల‌కే భ‌యం క‌లిగించేలా హీరో చిరంజీవి ఏక‌ధాటిగా సినిమాలు పూర్తి చేస్తూ కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తుండ‌టం విశేషం.


By November 11, 2021 at 08:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-bholashankar-launched/articleshow/87638811.cms

No comments