Breaking News

ప్రీతమ్‌తో కలిసి సమంత రచ్చ.. స్నేహితురాలితో ఎంజాయ్! వైరల్ అవుతున్న వీడియో


నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక స్పీడు పెంచింది. వ్యక్తిగత జీవితాన్ని, అందుకు సంబంధించిన చేదు అనుభవాలను మరచిపోతూ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ తనకు సంబంధించిన ప్రతి క్షణాన్ని నెటిజన్ల ముందు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. సమంత, ఆమె స్టైలిస్ట్ ఎంత క్లోజ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ఈ ఇద్దరితో పాటు సమంత గ్యాంగ్‌లో మరో స్నేహితురాలు . సమంత చేసే పనుల్లో సాధన సింగ్, ప్రీతమ్‌ల హ్యాండ్ ఎంతో కొంత అయినా ఉంటుంది. అలా ఈ ముగ్గురిదీ విడదీయరాని బాండింగ్. అయితే ఇటీవలి కాలంలో నాగ చైతన్యతో విడిపోయానన్న బాధను ఎక్కడా చూపించకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న సమంత, ఈ ఇద్దరితో కలిసి ఫన్నీ టాస్క్ చేసింది. సాధన సింగ్‌‌కు మేకప్ వేసే ప్రయత్నంలో భాగంగా సమంత, ప్రీతమ్‌లు కొంటె చేష్టలతో రచ్చ చేశారు. ఆహ్లాదకరమైన క్షణాలు గడుపుతూ కాసేపు సరదాగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సామ్ తన అభిమానులతో పంచుకుంటూ ఆమె "పెళ్లి బుకింగ్ ఓపెన్" అని పేర్కొంది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇటీవలే 'శాకుంతలం' సినిమా కంప్లీట్ చేసిన సమంత ఇప్పుడిప్పుడే షూటింగ్లో బిజీ అవుతోంది. ఇప్పటికే ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండగా మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టింది.


By November 19, 2021 at 12:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/preetham-jukalker-and-samantha-enjoyed-with-sadhana-singh/articleshow/87795693.cms

No comments