హోం మంత్రి వార్నింగ్.. మంగళసూత్ర యాాడ్‌పై వెనక్కుతగ్గిన ప్రముఖ డిజైనర్!
ఇటీవల డాబర్ సంస్థ కర్వ చతుర్ది వాణిజ్య ప్రకటన వివాదాస్పదం కావడంతో దానిని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రూపొందించిన వాణిజ్య ప్రచార చిత్రం వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆ ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. మంగళసూత్ర వాణిజ్య ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీ చేశారు. వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకోకుంటే పోలీసు బలగాలను పంపుతామంటూ హోం మంత్రి హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ‘‘వారసత్వం, సంస్కృతిని డైనమిక్ సంభాషణగా మార్చే సందర్భంలో, మంగళసూత్ర ప్రచారం చేశాం.. కానీ ఈ ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మేం చాలా బాధపడ్డాం.. సబ్యసాచి ప్రచార ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’’ అని డిజైనర్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. ఈ ప్రమోషనల్ ఫొటోషూట్‌లో మోడల్స్ మంగళ సూత్రం ధరించి కనిపించారు.. కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొందరు అసభ్యకర రీతుల్లో మంగళ సూత్రం ధరించారు. ఫలితంగా నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తిపోశారు. ఇది హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా, అభ్యంతరకంగా ఉందని మండిపడ్డారు. దీంతో సబ్యసాచి తన వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రకటనల గురించి ముందే హెచ్చరించాను.. నేను వ్యక్తిగతంగా డిజైనర్ సబ్యసాచి ముఖర్జీని హెచ్చరిస్తున్నాను.. అతనికి 24 గంటల సమయం ఇస్తున్నాం... ఈ అభ్యంతరకర, అసభ్యకర ప్రకటనను ఉపసంహరించుకోకుంటే అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం... చర్య కోసం పోలీసు బలగాలను పంపుతాం’ అని పేర్కొన్నారు. కర్వ చతుర్ది పండుగకు లెస్బియన్ల అంశాన్ని చేర్చి డాబర్ సంస్థ కమర్షియల్ యాడ్ వివాదంలో చిక్కుకుంది. స్వలింగ సంపర్కులకు మద్దతు ఇచ్చేలా రూపొందించిన ఈ యాడ్‌పై కొందరు అభ్యంతరం చెప్పారు. ప్రతిసారీ ఎందుకిలా హిందువుల సంప్రదాయాల్నీ, పండుగల్నీ పక్కదారి పట్టించేలా యాడ్స్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో డాబర్ సంస్థ దానిని ఉపసంహరించుకుంది.
By November 01, 2021 at 11:43AM
No comments