ఆమె పాడుతుంటే.. బకెట్లతో నోట్లు కుమ్మరించారు.. వీడియో వైరల్
ఓ జానపద గాయనిపై నోట్లు కుమ్మరించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రేక్షకులు. ఆమె కచేరీ చేస్తున్నంతసేపూ డబ్బులు వెదజల్లుతూనే ఉన్నారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లడంతో వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంగీత కచేరీ చేసేందుకు ప్రముఖ జానపద గాయని ఊర్వశి రాధాదియాను ఆహ్వానించారు. తన బృందంతో ఆమె కచేరీ నిర్వహిస్తున్న సమయంలో హరిద్వార్ సంఘం సభ్యులు, ప్రేక్షకులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. బకెట్లలో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాధాదియా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షల మంది వీక్షించారు. తనపై కరెన్సీ నోట్లు వెదజల్లుతుంటే ఆమె సంతోషంతో ఉబ్బితబ్బుబ్బియ్యింది. అయితే, కరెన్సీ నోట్లను కుమ్మరించడం పట్ల నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ‘ఇలాగే పెరుగుతూ ప్రకాశిస్తూ ఉండండి’ అని ఒకరు.. చాలా బాగుంది దీదీ, చాలా ప్రేమ’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అయితే చాలా మంది లక్ష్మీదేవి అగౌరవపరచడమేనని అభివర్ణించారు. ‘ఇది చాలా అగౌరవంగా ఉంది.. నోట్ల వర్షంలా కురిపించడం ఎందుకు?’ అని నిలదీశారు. ఇప్పటి వరకూ దీనికి 17 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి.
By November 21, 2021 at 11:48AM
No comments