అఖండ టైటిల్ సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రాక్.. నందమూరి అభిమానులకు మాస్ కిక్
మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ బోయపాటి శ్రీను- నందమూరి నటసింహం కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ 'అఖండ'. షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్‌ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేసి రికార్డులు తిరగరాశారు. అదే జోష్‌లో తాజాగా నేడు (నవంబర్ 8న) టైటిల్ ట్రాక్ ఫుల్ సాంగ్ వదిలారు. ఈ సాంగ్ నందమూరి అభిమానులకు యమ కిక్కిచ్చేలా, అందరిలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. భం.. అఖండ అంటూ చాలా స్ట్రాంగ్ లిరిక్స్‌తో సాగిపోతున్న ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించారు. కట్టిన బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. షూటింగ్ చేస్తున్నప్పటి భారీ విజువల్స్ చూపించి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారి వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే థియేటర్లో ఈ సాంగ్ సృష్టించే హంగామా మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బోయపాటి- బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ''సింహా, లెజెండ్'' చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. ఈ హాట్రిక్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
By November 08, 2021 at 12:40PM
No comments