శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎమోషనల్ కామెంట్స్
ఫేమస్ సినీ కొరియోగ్రాఫర్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ , నందమూరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి తుది శ్వాస విడిచారనే వార్త మనసును కలచివేసింది. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. ఖైదీ చిత్రానికి సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం చేసినా ఆయన అసిస్టెంట్‌గా వెనకుండి డాన్సులు కంపోజ్ చేసింది శివ శంకర్ మాస్టర్. ఆ రోజు మొదలుకొని మగధీర వరకు అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు మరపురాని డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఆయన్ను చివరిసారిగా 'ఆచార్య' సెట్స్ మీద కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఆయన మరణం కేవలం ఒక నృత్య రంగానికే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు'' అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'' అన్నారు. స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్‌ను కాపాడుకునేందుకు శక్తిమేర కృషి చేశాం. కానీ దేవుడు మరోలా నిర్ణయించాడు. ఆయన మరణవార్త కలచివేసింది'' అని పేర్కొన్నారు.
By November 29, 2021 at 07:45AM
No comments