Breaking News

వెండితెరపై సుమ.. కోట్లలో రెమ్మ్యూనరేషన్! అవునంటూ మాటల మహారాణి ఫుల్ క్లారిటీ


తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమది ప్రత్యేకమైన స్థానం. సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తూ కేవలం మాటలతోనే మ్యాజిక్ చేస్తుండటం స్టైల్. తనదైన మాటల తూటాలతో, సమయానుసార పంచులతో ఎంతటి హీరోకైనా చుక్కలు చూపించడం ఒక్క సుమకే సాధ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తూ ప్రతి ఇంట సందడి చేసే ఈ మాటల మహారాణి.. సినిమా ఈవెంట్స్ వచ్చాయంటే వేదికపై నానా హంగామా చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సుమకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. బుల్లితెర యాంకర్స్ వెండితెరపై కూడా మెరుస్తుండటం చూస్తున్నాం. ముఖ్యంగా నేటితరం యాంకర్లంతా అదే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో అనసూయ, రష్మీ, శ్రీముఖి, ఝాన్సీ లాంటి యాంకర్స్ ఉండగా ఇప్పుడు సుమ వచ్చి చేరుతోంది. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన ఈ యాంకర్ ఇక వెండితెరపై మెరుపులు మెరిపించనుందట. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ వైరల్ అవుతుండగా తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది సుమ. ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని కాస్త వెరైటీగా చెప్పింది. స్టార్ హీరోల వీడియో క్లిప్స్ కట్ చేస్తూ ఓ వీడియో రెడీ చేసి.. ''ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే'' అంటూ ఓపెన్ అయింది సుమ. రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉండనుంది అనే హింట్ ఇచ్చేసింది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వబోతున్నామంటూ మ్యాటర్ బయట పెట్టింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సుమ నటించబోయే ఆ సినిమా ఏంటి? ఎలాంటి రోల్ చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే మరి!.


By November 02, 2021 at 12:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/interesting-update-on-anchor-suma-cine-entry/articleshow/87481434.cms

No comments