Breaking News

ఆ విషయాలు బయటకు వచ్చి చెప్పాలి!.. ఉపాసన కామెంట్స్ వైరల్


మెగా కోడలు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియా చానెల్‌తో ఆమె మాట్లాడిన మాటలు, అందులో చెప్పిన విషయాలు, పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల మీద స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఇన్నాళ్లుగా అందరి మదిలో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. పిల్లల్ని ఎందుకు కనడం లేదు అని ప్రశ్నించే వారికి మంచి సమాధానం ఇచ్చింది. అవన్నీ కూడా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి, వాటి గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదంటూ ఉపాసన తన అభిప్రాయాన్ని తెలిపింది సంతోషకరమైన ఆ శుభవార్త సమయం వచ్చినప్పుడు వస్తుంది.. దాన్ని నేనే చెబుతాను అంటూ ఉపాసన తెలిపింది. అలా ఎన్నెన్నో విషయాల మీద ఉపాసన స్పందించింది. సమంతతో తనకున్న స్నేహం, సానీయాతో ఉన్న అనుబంధం గురించి ఉపాసన చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అత్తవారిళ్లు, పుట్టింటి గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. అయితే మహిళల గురించి కొన్ని విషయాలను మాట్లాడింది. మహిళలు బయటకు వచ్చి.. మగవాళ్లు తమ శక్తి, సామర్థ్యం, వారే మా బలం అని చెబుతారు. కానీ మగవాళ్లు ఎప్పుడైనా బయటకు వచ్చి.. ఆడవాళ్లు తమ బలం అని చెబుతారా? కానీ చెప్పాలి. ఆ రోజులు రావాలి. అలాంటి సందర్భం, సమయం వచ్చినప్పుడే ఈ వివక్ష పోతుందని ఉపాసన తెలిపింది. తనకు సానీయా అంటే ఎంతో ఇష్టం.. నెక్స్ట్ లెవెల్ అల్లరి చేస్తుందని ఉపానన అంది. ఇక నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను.. ఆమెను చూసి ఇన్ స్పైర్ అవుతున్నాను అంటూ ఉపాసన ఎంతో గొప్పగా చెప్పింది.


By November 13, 2021 at 02:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-konidela-on-women-empowerment/articleshow/87682842.cms

No comments