Breaking News

నెహ్రూ జయంతి వేడుకలకు వెంకయ్య దూరం.. విమర్శలపై రాజ్యసభ కీలక ప్రకటన


నవంబరు 14న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ వేడుకలను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్ ఉపరాష్ట్రపతి , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా సీనియర్ కేంద్ర మంత్రులు ఎవరూ హాజరుకాకపోవడంపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సెక్రటేరియట్ స్పందించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగే అటువంటి కార్యక్రమాలకు ఉప-రాష్ట్రపతి ఎప్పుడూ హాజరుకారని సోమవారం స్పష్టం చేసింది. ఏటా నవంబరు 14న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జవహర్‌లాల్‌కి నివాళులర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ హాజరుకాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేశ్ ట్విట్టర్‌లో విమర్శించారు. ‘‘పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అలంకరించిన వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సాంప్రదాయ కార్యక్రమంలో ఈ రోజు అసాధారణ దృశ్యం. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ గైర్హాజరయ్యారు. ఒక్క కేంద్ర మంత్రి కూడా హాజరుకాలేదు.. ఇంతకంటే దారుణం ఉంటుందా?!’ అని ధ్వజమెత్తారు. దీనిపై రాజ్యసభ సెక్రటేరియట్ స్పష్టతనిస్తూ‘పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశాల నిమిత్తం నిర్వహించే ఇటువంటి వేడుకలకు భారత ఎన్నడూ హాజరుకారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్న జరిగిన వేడుకలకు రాలేదని తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది. ‘తప్పుదోవ పట్టించే ఇటువంటి నివేదికలు వెంకయ్యనాయుడ్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.. ఆదివారం ఢిల్లీలో లేని ఉపరాష్ట్రపతి మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూకు నివాళులు అర్పించనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి’ అని తెలిపింది. అలాగే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఢిల్లీలో లేరని, రాజధానిలో ఉండేటప్పుడు ఆయన ఇటువంటి కార్యక్రమాలకు హాజరవుతారన్ని స్పష్టం చేసింది. ఇక, జయరామ్ రమేశ్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డేరక్ ఒబ్రెయిన్ స్పందిస్తూ.. ‘ఏది నాకు ఆశ్చర్యం కలిగించలేదు... ఈ పాలనలో ఏదో ఒక్క రోజు పార్లమెంటుతో సహా భారతదేశపు గొప్ప సంస్థలను నాశనం చేస్తుంది’ అని అన్నారు.


By November 16, 2021 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vice-president-traditionally-doesnt-attend-says-rajya-sabha-secretariat-on-nehru-event/articleshow/87732012.cms

No comments