Breaking News

పూజా హెగ్డే బికినీ కిక్ మామూలుగా లేదే..! కురచ దుస్తుల్లో బుట్టబొమ్మ చిల్.. వీడియో వైరల్


ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా మాల్దీవుల బాట పడుతుండటం చూస్తున్నాం. షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటూనే ఏ మాత్రం గ్యాప్ దొరికినా మాల్దీవుల్లో వాలిపోతున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లారంటే ఇక నెటిజన్లకు పండగే పండగ. హాట్ బ్యూటీలు అక్కడి బీచ్ ఒడ్డున బికినీ వేసి ఎంజాయ్ చేసే క్షణాలను ఇక్కడ నుంచే చూస్తూ మైమరిచిపోతుంటారు నెటిజన్లు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లి నెటిజన్లకు డబుల్ కిక్ ఇచ్చింది యంగ్ హీరోయిన్ . ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాతో సక్సెస్ అందుకున్న పూజా.. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మాల్దీవుల్లో అందాలు ఆరబోసింది. బికినీ వేసి బీచ్ పరిసరాల్లో డాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. కురచ దుస్తుల్లో జలపాతం నడుమ చిల్ అయింది బుట్టబొమ్మ. విహారయాత్రలో ఎంజాయ్ చేయడమంటే ఇదీ అన్నట్లుగా రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఆయా ఫొటోలు, వీడియోలు సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కించింది. బీచ్ వైపు న‌డుచుకుంటూ వ‌చ్చి.. బికినీలోకి ట్రాన్స్ ఫార్మేష‌న్ అయిన వీడియో షేర్ చేసింది పూజా. సాగరతీరాన పూజా హెగ్డే చేస్తున్న సందడి చూసి ఫిదా అయ్యారు నెటిజన్లు. పూజా హాట్ ట్రీట్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మాల్దీవుల ట్రిప్‌ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చింది. ఇక ఈ అందాల తార సినిమాల విషయానికొస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన ఆమె నటించిన ‘రాధే శ్యామ్‌’ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ సరసన నటిస్తున్న ‘ఆచార్య’ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ కీలకంగా ఉండనుందట.


By November 20, 2021 at 11:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-return-back-from-maldives-vacation-trip/articleshow/87813450.cms

No comments