Breaking News

ఈ గొర్రె ధరెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..? వామ్మో అంత రేటు ఎందుకు..?


గొర్రెపోతు ధర ఎంత ఉంటుంది..? మహా అయితే పాతిక వేలు లేదంటే ముప్పై వేలు కదూ. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న గొర్రె ధరెంతో ఊహించండి..? పూలతో అందంగా ముస్తాబు చేశారు.. డప్పులు కొడుతూ తీసుకొస్తున్నారంటే.. ఇదేదో స్పెషల్ గొర్రెలా ఉంది కాబట్టి.. రూ.50 వేలు ఉండొచ్చేమో అనుకుంటున్నారా..? కాదు దీని ధర అక్షరాలా రూ.1.91 లక్షలు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మళవళ్లి తాలుకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప.. దీన్ని రూ.1.91 లక్షలకు విక్రయించాడు. వాస్తవానికి ఆయన రెండేళ్ల క్రితం ఈ గొర్రె పిల్లను 1 లక్షా 5 వేలకు కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తెచ్చుకున్నాక.. జాగ్రత్తగా సాకాడు.. మంచి పౌష్టికాహారం అందించి పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు దాన్ని మద్దూరు తాలుకాలోని బిదరకోటే‌కు చెందిన క్రిష్ణప్ప అనే వ్యక్తికి అమ్మేశాడు. భారీ ధర పెట్టి దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి.. డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని చూడటానికి జనం భారీగా తరలివచ్చారు. ఇంతకూ ఈ గొర్రెకు ఇంత ధర ఎందుకు పెట్టడం అనుకుంటున్నారా? ఈ గొర్రె సంతానోత్పత్తికి కీలకంగా మారిందట. దీని ద్వారా సణ్ణప్ప బానే సంపాదించాడు. ఈ విషయం తెలిసే క్రిష్ణప్ప భారీ ధర పెట్టి మరీ కొనుగోలు చేశాడట.


By November 09, 2021 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sheep-sold-worth-rs-1-91-lakh-in-mandya-of-karnataka/articleshow/87597387.cms

No comments