రివాల్వర్‌తో కాల్చుకుని ఎమ్మెల్యే కొడుకు.. సూసైడ్ నోట్‌లో కీలక సమాచారం
ఓ ప్రజాప్రతినిధి కుమారుడు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు (17) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. జబల్‌పూర్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలోనే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో తలపై కాల్చుకున్నాడు. రివాల్వర్ పేలిన శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. బాత్‌రూమ్‌లో తీవ్ర గాయంతో పడి ఉన్న వైభవ్ యాదవ్‌ను హుటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వైభవ్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణం మాత్రం నోట్‌లో వెల్లడించలేదని జబల్‌పూర్ ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణ పేర్కొన్నారు. అయితే, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన స్నేహితులకు వైభవ్ యాదవ్ మెసేజ్ పెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం వైభవ్ స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ బర్గి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో గెలిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు (23), వైభవ్ రెండోవాడు. జబల్‌పూర్ ఎస్పీ బహుగుణ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో వైభవ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వైభవ్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైందని వివరించారు. అయితే, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యలతోనే వైభవ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
By November 12, 2021 at 06:48AM
No comments