Breaking News

మానవత్వం చచ్చిపోయింది.. మరీ ఇంత దారుణమా? రష్మీ గౌతమ్ ఎమోషనల్ కామెంట్స్


బుల్లితెరపై ఎంత హంగామా చేస్తుంటుందో సోషల్ మీడియాలోనూ అదే హవా నడిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్, అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఓ జంతు ప్రేమికురాలిగా జంతువులకు హాని జరిగే విషయాలను అస్సలు సహించదు . అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మీ. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఘటన బయటకు వచ్చింది. దీపావళి సంబరాల్లో మునిగిపోయిన కొందరు ఆకతాయిలు మూగ జీవాల మీద తమ ప్రతాపాన్ని చూపించారు. వీధి కుక్కను తమ పైత్యంతో హింసించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై, తోక తెగి పడిపడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉందట. ఈ విచారకమైన వార్త రష్మీ కంటపడటంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది. సదరు దుర్ఘటన తాలూకు మీడియా సందేశాన్ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేస్తూ.. మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదంటూ విరుచుకుపడింది. రష్మీ పోస్ట్ చేశాక ఈ దారుణ ఘటన గురించి చాలామందికి తెలియడంతో అందరూ భగ్గుమంటున్నారు. అలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఇలా ముగా జీవులపై జరుగుతున్న దాడులను ఖండించింది రష్మీ. లాక్‌డౌన్ వేళ అయితే నేరుగా రోడ్లపైకి వెళ్లి వీధి కుక్కలకు ఆహారం అందించి మానవత్వం చాటుకుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇలా మూగ జీవాల పట్ల రష్మీ చూపిస్తున్న ప్రేమపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.


By November 10, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-rashmi-emotional-comments-on-west-bengal-street-dog-incident/articleshow/87617079.cms

No comments