ఫామ్‌హౌస్‌ను పేకాట క్లబ్‌గా మార్చేసిన యంగ్ హీరో...షాకిచ్చిన పోలీసులు.. అసలు నిజాలేంటి?
రేవు పార్టీలు జరగడం అనేవి గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల కళ్లు గప్పి జరిగిపోతుంటాయి. ఒక రేవు పార్టీలే కావు.. చాలా విషయాలు పోలీసులకు తెలియకుండా జరుగుతుంటాయని ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఆపరేషన్‌లో బట్టబయలైంది. అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే, హైదరాబాద్ శివార్లులోని మంచి రేవుల దగ్గర ఓ ఫామ్ హౌస్ ఉంది. అది కేవలం ఫామ్ హౌస్ అనుకుంటే పొరబడట్టే. పెద్ద జూదశాలగా మారిపోయింది. ఈ విషయాన్ని పోలీసులు, ఛానెల్‌వాళ్లు కనిపెట్టేశారు. ఈ యంగ్ హీరో ఆధ్వర్యంలోనే ఈ ఫామ్ హౌస్ కమ్ పేకాట క్లబ్ రన్ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడొక రేంజ్‌లో బిజినెస్ జరుగుతుంది. క్యాసినోను మించిన రేంజ్‌లో వ్యాపారం జరుగుతుండటం కొసమెరుపు. ఇదంతా సుమంత్ చౌదరి అనే వ్యక్తి నడిపిస్తున్నాడనే వార్తలు వచ్చినా, అసలు సూత్రధారి మాత్రం సదరు యంగ్ హీరోనే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఈ ఫామ్‌హౌస్‌ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుని దాన్ని పేకాట క్లబ్‌గా మార్చారట. ఇప్పుడీ కేసులో సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా చిక్కుకున్నట్లైంది. ఫామ్ హౌస్‌పై రైడ్ చేసిన పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు 25 లక్షల క్యాష్, స్వాపింగ్ మెషీన్లు, కార్లను సీజ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రియల్ ఎస్టేట్ సహా పలు రంగాలకు చెందిన బడా బాబులు ఈ ఫామ్‌హౌస్‌కు వస్తారని టాక్. ఈ వ్యవహారం వెనుక యంగ్ హీరో నాగశౌర్య ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎటువంటి ఆధారాలు దొరికిన దాఖలాలు లేవు. మరి ఈయన పేరు ఇరికించారా? నిజంగానే ఆయన హస్తం ఉందా? అని తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న నాగశౌర్య పేరు ఇలా బయటకు రావడం నిజంగా ఆయనకు ఇబ్బందిని కలిగించేదే. అయితే దీనిపై ఆయనెలా స్పందిస్తారు.. అసలు సుమంత్ చౌదరి ఎవరు? నిజంగానే సుమంత్ చౌదరికి నాగశౌర్యకి సంబంధం ఉందా? అనే విషయాలపై నిజంగా అసలు స్పందిస్తారో లేదో చూడాలి.
By November 01, 2021 at 07:05AM
No comments