Breaking News

Bala Krishna : టీడీపీ పగ్గాలు తీసుకుని ముఖ్యమంత్రి ఎందుకు కాలేదో చెప్పిన బాలకృష్ణ


తెలుగువారి ఆత్మ గౌర‌వం అంటూ ప్రారంభమైన పార్టీ తెలుగుదేశం. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు పార్టీ అధ్య‌క్షుడిగా పార్టీ పెట్టిన ఎనిమిది నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రిగా అధికారాన్ని ద‌క్కించుకున్నారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో చంద్ర‌బాబు తెలుగు దేశం అధ్య‌క్షుడిగా మారి టీడీపీ పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వార‌సులుగా హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ ఇలా చాలా మంది ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఎందుకు పార్టీ ప‌గ్గాలు అందుకున్నారు. అనే ప్ర‌శ్న చాలా మందిలో ఎన్నో ఏళ్లుగా ఉండిపోయిన ప్ర‌శ్న‌. దీనిపై రీసెంట్‌గా జ‌రిగిన అన్‌స్టాప‌బుట్ టాక్‌షోలో వివ‌ర‌ణ ఇచ్చారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ‘అందరూ అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన తర్వాత మీరు పగ్గాలు అందుకుంటారని అందరూ అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పజెప్పారు.. ఎందుకు?’ అంటూ అంతకు ముందు విడుద‌ల చేసిన ‘అన్‌స్టాప‌బుల్’ ఇంట‌ర్వ్యూ ప్రోమోలో ఇదే క్వశ్చ‌న్‌ను మోహ‌న్‌బాబు బాల‌కృష్ణ‌ను అడ‌గ‌టాన్ని అంద‌రూ చూశారు. అస‌లు బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతారు? ఏమ‌ని స‌మాధానం చెబుతారు? అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన పూర్తి ఇంట‌ర్వ్యూలో బాల‌య్య స‌మాధానాన్ని అంద‌రూ విన్నారు. ఇంత‌కీ మోహ‌న్‌బాబు వేసిన ప్ర‌శ్న‌కు బాల‌కృష్ణ ఏమ‌ని స‌మాధానం చెప్పారంటే.. అప్ప‌ట్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వార‌స‌త్వ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. దానికి వ్య‌తిరేకంగా టీడీపీ కూడా పోరాటం చేసింది. పార్టీ అనేది ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డాలి. అలాంటిది మ‌న‌మే వార‌స‌త్వ రాజ‌కీయాలు చేస్తే బావుంద‌నిపించింది. అదీగాక చంద్ర‌బాబు నాయుడు పంచాయ‌తీ స్థాయి నుంచి ఎదిగిన వ్య‌క్తి, మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న నాయ‌కుడు అనిపించి ఆయ‌న‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాం’’ అన్నారు. మొట్ట‌మొద‌టిసారి నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా మారి ఆహాలో చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాప‌బుల్‌’. ఇందులో సినీ సెల‌బ్రిటీల గురించి బాల‌కృష్ణ వినూత్నంగా మాట్లాడుతూ వారి విష‌యాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను చెప్ప‌బోతున్నారు. అందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను మోహ‌న్‌బాబు అండ్ విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ల‌పై చిత్రీక‌రించారు. అది దీపావ‌ళి రోజున ప్ర‌సార‌మైంది. మరో వైపు అఖండ సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. రీసెంట్‌గానే బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరిగింది. ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ సూచించడంతో రెస్ట్ తీసుకుంటున్నారు బాలకృష్ణ. ఇక మిగిలిన ఎపిసోడ్స్‌కు సంబందించిన వివ‌రాలు తెలుస్తాయి.


By November 05, 2021 at 09:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bala-krishna-explanation-about-why-he-has-not-taken-tdp-party-responsibilities-after-his-father-ntr/articleshow/87532390.cms

No comments