Breaking News

ACB Raids డ్రైనేజీ పైపుల్లో కట్టల కొద్దీ కరెన్సీ.. అవినీతి అధికారి బాగోతం బట్టబయలు!


వ్యాప్తంగా బుధవారం ఏకకాలంలో అవినీతి నియంత్రణ అధికారులు చేపట్టిన దాడులు కలకలం సృష్టించాయి. సుమారు 400కుపైగా అధికారులు, ఉద్యోగులు నివాసాలపై ఏసీబీ జరిపిన దాడుల్లో నోట్ల కట్టలు, బంగారం బిస్కెట్లు, రూ.కోట్ల విలువైన చరాస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో బయటపడిన అవినీతి సంపద చూసి ఏసీబీ అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. అక్రమార్జనలో అధికారులతో పోటీ పడ్డారు. ఏ అధికారి అవినీతి సొమ్మును ఏకంగా డ్రైనేజీ పైపుల్లోనే దాచిపెట్టిన విషయం వెల్లడయ్యింది. కలబుర్గి జిల్లాలో పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజినీర్ శాంత గౌడ బిర్దార్ నివాసంలోని డ్రైనేజీ పైపులో భారీగా నగదు లభ్యమయ్యింది. జాయింట్ ఇంజినీర్ పైపుల్లో సొమ్ము దాచిపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఏసీబీ.. ప్లంబర్ సాయంతో పైపులను తొలగించి అందులోని నగదును స్వాధీనం చేసుకుంది. రూ.25 లక్షల నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు అక్కడ లభించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరు నగర పాలికెలో ఫస్ట్‌ గ్రేడ్‌ అధికారి, కన్నడ సాహిత్య పరిషత్‌ నగర మాజీ అధ్యక్షుడు మాయణ్ణకు ఆప్తురాలు ఉమాదేవి నివాసంలో అధికారులు సోదా చేశారు. కత్రిగుప్పెలోని మాయణ్ణ నివాసంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సోదాలు కొనసాగించారు. ఆయన నివాసంలో లభించిన కొన్ని పత్రాల ఆధారంగా నందిని లేఅవుట్‌లోని ఉమాదేవి నివాసంపై దాడి చేసి ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరులో ఎమర్జెన్సీ విభాగం కేఏఎస్‌ అధికారి నాగరాజ్, యలహంక ప్రభుత్వ ఆసుపత్రి ఫిజియోథెరపిస్టు రాజశేఖర, రహదారుల విభాగం అధికారి మాయణ్ణ, పాలికె- డి గ్రూపు ఉద్యోగి బాగలగుంటె గిరి నివాసాల్లోనూ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లోనూ లెక్కలోకి రాని రూ.కోట్ల విలువైన స్థిర, చరాస్తుల దాఖలాలు లభించాయి. కాగా, తమ ప్రభుత్వం అవినీతిని ఉపేక్షించదని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం.


By November 25, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cash-pipeline-found-during-statewide-acb-raids-at-karnataka-officials-home/articleshow/87900675.cms

No comments