Breaking News

యువకుడి సాహసం.. ఫ్లైట్ ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని 1,600కి.మీ. ప్రయాణం.. వీడియో వైరల్


విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఓ వ్యక్తి 1,600కిపైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. చిన్ని గాయమైన కాకుండా అతడు చేరుకున్న ఈ ఘటన అమెరికాలోని మియామీలో చోటుచేసుకుంది. నుంచి శనివారం ఉదయం మియామికి చేరుకున్న విమానంలో ప్రయాణికులు కిందకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు విమానాశ్రయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగా.. బయటకు వచ్చిన ఓ యువకుడ్ని (26) చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి విమానం కింద భాగంలో ఉండే ల్యాండింగ్ గేర్ నుంచి బయటకు దిగాడు. గ్వాటెమాలా నుంచి మియామి నగరానికి దాదాపు 1,640 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితే ఆ ప్రయాణం మొత్తం ఆ యువకుడు విమానం టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్‌ గేర్‌లోనే ఉన్నాడు. కిందకు దిగిన తర్వాత అతడికి సంబంధించిన దృశ్యాలను సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియోను స్థానిక మీడియా డబ్ల్యూటీవీజే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. నీల రంగు జీన్స్, టీ షర్ట్ దానిపై జాకెట్ ధరించిన యువకుడు విమానం కింది భాగం నుంచి దిగడంతో సిబ్బంది గమనించి అవాక్కయ్యారు. ఆ తర్వాత నీళ్లు తాగుతావా? అని అతడిని అడిగడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై వీడియో తీసిన విమానాశ్రయ సిబ్బంది స్పందించేందుకు నిరాకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ (సీబీపీ) ఓ ప్రకటన వెలువరించింది. ‘‘అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ అధికారులు మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 26 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నాయి.. గ్వాటెమాలా నుంచి శనివారం ఉదయం వచ్చిన విమానంలో ల్యాండ్ గేర్‌లో దాక్కుని అనుమతి లేకుండా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించాడు’’ అని తెలిపింది. అమెరికాకు దక్షిణాన ఉన్న గ్యాటెమాలాలో నేరస్థుల ముఠాల అరాచకాలు పెరిగిపోవడం, పేదరికం కారణంగా కొంతకాలంగా అక్కడి నుంచి అమెరికాకు అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇక, అఫ్గన్ ఆగస్టు సంక్షోభం సమయంలోనూ కాబూల్ విమానశ్రయంలో ఇటువంటి దృశ్యాలే వెలుగుచూశాయి. 1947 నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల్లో 129 మంది ప్రమాదకరంగా ప్రయాణించేందుకు ప్రయత్నించారు. వీరిలో 100 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 2014 ఏప్రిల్‌లో ఏ పదహారేళ్ల బాలుడు కాలిఫోర్నియా నుంచి హవాయి విమానంలో ఇలాగే చేరుకున్నాడు.


By November 29, 2021 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/youth-survives-flight-from-guatemala-to-miami-hidden-in-planes-landing-gear/articleshow/87971255.cms

No comments