Surya: మరోసారి ఓటీటీకే ఓటేసిన సూర్య.... ఈసారి ఎలాంటి సమస్యలు వస్తాయో మరి!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/86698387/photo-86698387.jpg)
హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేటర్స్‌కు గడ్డు పరిస్థితులు వచ్చినప్పటి నుంచి సూర్య తన రూట్‌ను మార్చుకున్నాడు. ఓటీటీల వైపు మొగ్గు చూపాడు. ఆయన హీరోగా చేసిన ఆకాశం నీ హద్దురా సినిమాను అమెజాన్‌లోనే రిలీజ్ చేశాడు. ఆ సినిమాకు చాలా మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సూర్యపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే కూడా సూర్య వాటిని పట్టించుకోకుండా సినిమాను ఓటీటీలోనే విడుదల చేశాడు. సరే! అప్పుడంటే థియేటర్స్ ఓపెన్ కాలేదు. సినిమా కోసం తీసుకున్న మొత్తాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయని సూర్య కారణం చెప్పాడు. అప్పట్లో సూర్య నిర్ణయం సరైనదేనని చెప్పినవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అయినా కూడా సూర్య మరో సినిమాను కూడా సూర్య ఓటీటీలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమానే జై భీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 2న విడుదలవుతుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. మరిప్పుడు సూర్య ఓటీటీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏమని చెబుతాడో చూడాలి. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సూర్య, జ్యోతికలు సినిమాను నిర్మించారు. మరోవైపు పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వాళ్ల నిర్మాణంలో ఎదుక్కూ తునింజవన్ సినిమా రూపొందుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ రెండు సినిమాల విడుదలకు సూర్యకు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు సినిమాలకు నిర్మాతలు బయట ప్రొడక్షన్స్ కావడంతో వీటి విడుదలలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.
By October 02, 2021 at 07:30AM
No comments