Breaking News

Surekha Vani: నాగ చైతన్య- సమంత విడాకులపై సురేఖావాణి రియాక్షన్.. ఆ మాట చెబుతూ ఎమోషనల్ కామెంట్స్


కొద్దిరోజులుగా ట్రెండింగ్ అవుతున్న అంశం . చాలా రోజులుగా ఈ విషయంపై చాలా రకాల వార్తలు వచ్చాయి. చై- సామ్ విడిపోతున్నారని, ఇప్పటికే వాళ్లకు పలు సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని విన్నాం. అయితే నిన్న (శనివారం) ఈ విషయాన్ని అటు సమంత, ఇటు నాగ చైతన్య అధికారికంగా దృవీకరించడంతో వారి వారి సన్నిహితులు, అభిమానుల గుండె పగిలింది. ఏదైతే జరగొద్దని ఇన్ని రోజులు కోరుకున్నారో అదే జరిగిపోవడంతో అంతా షాక్‌లో ఉండిపోయారు. ఇకపై తామిద్దరం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని నాగ చైతన్య, సమంత కన్ఫర్మ్ చేసిన కొద్ది సేపటికే నాగార్జున రియాక్ట్ అవుతూ.. ''బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను'' అంటూ పోస్ట్ పెట్టారు. అయితే తాజాగా నాగార్జున పెట్టిన ఇదే పోస్ట్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న .. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది.. చాలా బాధగా ఉంది అని సురేఖ అన్నారు. మరోవైపు చైసామ్ డివోర్స్ ఇష్యూపై ఇప్పటికే కస్తూరీ శంకర్, ఆర్జీవీ వంటి వారు స్పందించిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ అయితే 'పెళ్లి అనేది చావు లాంటిది.. విడాకులు అనేది మళ్లీ పుట్టడం లాంటిది' అంటూ తనదైన కోణంలో సెటైరికల్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. 'ఏ మాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో చిగురించిన నాగ చైతన్య- సమంత ప్రేమ దాదాపు ఏడేళ్లపాటు కొనసాగింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 2021లో తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అక్కినేని కుటుంబ సభ్యురాలిగా కేవలం నాలుగేళ్లు మాత్రమే ట్రావెల్ చేయగలిగింది సమంత.


By October 03, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/surekha-vani-emotional-comments-on-naga-chaitanya-samantha-divorce/articleshow/86720894.cms

No comments