RRR : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు బెస్ట్ చెప్పిన రాజమౌళి
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం RRR. పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులతో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ ఇది. భారీ తారాగణం.. నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ఓ పక్క జరుగుతుండగా మరోవైపు రాజమౌళి తన సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా జక్కన్న ఓ ఇంటర్వ్యూలో RRR గురించి మాట్లాడారు. ఆ సమయంలో ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురితో మీరు పనిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవరికీ ఓటేస్తారు? అని ఒకరు ప్రశ్నించారు. అసలు రాజమౌళి ఎలాంటి సమాధానం చెబుతారా? అని అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే రాజమౌళి తెలివైన ప్రశ్నను చాలా తెలివిగా డీల్ చేసి అందరితో ఔరా! అనిపించుకున్నారు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే.. ‘‘ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరుంటారు. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో సమయం గడపటానికి ఇష్టపడతాను. అలాగే నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఓ రకంగా పిచ్చి. ఆ జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవడానికి గంటల సమయం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చరణ్‌తో సమయం గడపటానికి ఇష్టపడతాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజమౌళి. RRRలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ కనిపించనుంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు చరిత్రలో కలుసుకోలేదు. అయితే ఒకవేళ కలుసుకుని బ్రిటీష్‌వారిపై పోరాడితే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతాయనే విషయాన్ని టీజర్స్ ద్వారా ప్రెజెంట్ చేశారు దర్శకధీరుడు. అలాగే నవంబర్ 1న ఈ సినిమాలో 45 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
By October 31, 2021 at 01:04PM
No comments