Bala Krishna : బాలకృష్ణ అన్‌స్టాపబుల్.. ఐదు ఎపిసోడ్స్ లిస్టు ఇదే..నిజంగా ఆహా అనాల్సిందే!
నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక స్క్రీన్‌పై సందడి చేయాల్సింది మాత్రమే మిగిలింది. తెలుగు ఓటీటీ మాధ్యమమైన ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో షోకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహన్‌బాబు ఫ్యామిలీతో చిత్రీకరించారు. ఇందులో మంచు మోహన్‌బాబు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు పాల్గొనగా..వారిని బాలకృష్ణ ప్రశ్నలడిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో ముగిసింది. దీన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల ప్రసారం చేయబోతున్నారు. నందమూరి అభిమానులందరూ ఈ షో కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీ తాజా సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్‌లో ఐదు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యిందట. తొలి ఎపిసోడ్‌ను మోహన్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీకరించారు. ఇక రెండవ షోను రానా దగ్గుబాటిపై చిత్రీకరించారు. ఇక మూడో ఎపిసోడ్ నేచురల్ స్టార్ నానితో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. తర్వాత నాలుగో షోను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై చిత్రీకరించబోతున్నారు. ఇక ఐదవ ఎపిసోడ్‌ను నందమూరి మరో నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై చిత్రీకరిస్తారట. నిజంగానే అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూస్ లైనప్ మాత్రం అదిరింది. ప్రతి ఎపిసోడ్ అంచనాలను పెంచేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాలయ్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ దక్కినట్లు టాక్. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాలయ్యకు ఈ షో కోసం చెల్లించారట. దీనికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తదుపరి సీజన్‌ను ఎప్పుడు చేయాలనేది ప్లాన్ చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. దీని తర్వాత , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నుంచే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం.
By October 31, 2021 at 12:28PM
No comments