Roja: కల నెరవేరిందంటూ మురిసిపోతున్న అన్షు.. రోజా కూతురి ఆనందానికి కారణమిదే..
నగరి ఎమ్మెల్యే, సినీ నటి అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూయెన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటో ముద్రించారు. రచయితగా, ఎంటర్ప్రెన్యూయర్‌గా, ప్రోగ్రామర్‌గా అన్షు సమాజం కోసం పాటు పడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూయెన్సర్ మ్యాగజైన్ తెలిపింది. ఇక తనకు ఈ అరుదైన గుర్తింపు రావడం పట్ల స్పందించిన అన్షు.. తెగ సంబరపడిపోయింది. తన కల నెరవేరిందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా అన్షు ఫోటోను ప్రచురించారు. ఈ లెక్కన చూస్తే తల్లిలాగే అన్షు చాలా టాలెంట్ అని, తాను ఎంచుకున్న రంగంలో సిద్దహస్తురాలిగా తయారవుతోందని తెలుస్తోంది. సెల్వమణి- రోజా దంపతులకు అన్షు మల్లిక్, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీనేజ్‌లో ఉన్న ఆ ఇద్దరి అభిరుచులకి ఏ రోజు ఎదురు చెప్పకుండా స్వేచ్ఛనిస్తూ, గారాబంగా పెంచుతున్నారు ఈ పేరెంట్స్. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్, బర్త్ డే వేడుకల్లో రోజా తనయ అన్షు ఫొటోస్, ఫ్యామిలీ బాండింగ్ చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. కాగా, అన్షు సినీ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. తల్లి లాగే ఎంతో గ్లామర్‌గా ఉన్న అన్షు సినీ ఎంట్రీ ఇస్తే గొప్ప హీరోయిన్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే రోజా మాత్రం ఇప్పుడే తన కూతురు సినీ రంగప్రవేశం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.
By October 07, 2021 at 07:59AM
No comments