Ram Charan: మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరంటే?
వరుస పాన్ ఇండియా సినిమాలతో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుండగా, మరో వైపు స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇవి కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ట్రాక్ ఎక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు.. గౌతమ్ తిన్ననూరి. మళ్ళీరావా వంటి సినిమాతో పెద్ద హిట్ తర్వాత నానితో చేసిన జెర్సీతో ప్రేక్షకులే కాదు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. హిందీలోనూ షాహిద్ కపూర్‌తో జెర్సీని రీమేక్ చేస్తున్నాడు గౌతమ్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో గౌతమ్ తన తదుపరి సినిమాను రామ్ చరణ్‌తో చేయబోతుండటం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఎమోషనల్ కాన్సెప్ట్ మూవీలను తెరకెక్కించడంలో దిట్టగా పేరున్న గౌతమ్ తిన్ననూరి చరణ్‌ను ఎలా ప్రెజంట్ చేస్తాడనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దసరా సందర్భంగా తన 16వ చిత్రం గురించి రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. యు.వి.క్రియేషన్స్, ఎన్‌వి.ఆర్ సినిమా పతాకాలపై సినిమా రూపొందనుంది. శంకర్ సినిమా పూర్తయిన తర్వాతే చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కూడా కచ్చితంగా పాన్ ఇండియా సినిమాయే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు షాహిద్ కపూర్ జెర్సీతో గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడవుతాడనడంలో సందేహం లేదు. కాబట్టి చరణ్ ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుని ఉంటాడు.
By October 15, 2021 at 09:56AM
No comments