Aadavaallu Meeku Johaarlu : నవ్వుతున్న రష్మిక.. సిగ్గుపడుతోన్న శర్వా
ప్రస్తుతం మంచి ఊపుమీదున్నాడు. శర్వానంద్ ఇప్పటికే మహా సముద్రం అంటూ ప్రేక్షకులను పలకరించాడు. సెట్స్ మీద కూడా శర్వా రెండు మూడు ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్నాడు. అందులో ఒకటి అనే సినిమా. రష్మిక మందన్నాతో శర్వా చేస్తోన్న ఈ మొదటి చిత్రంపై పాజిటివ్ వైబ్ ఏర్పడింది. అయితే ఇందులో ఇప్పటి వరకు హీరో హీరోయిన్ల లుక్ ఎలా ఉంటుందో బయటకు చూపించలేదు. దసరా స్పెషల్ ఈ టీం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ బయటకు వచ్చింది. దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టేశారు. ఇందులో రష్మిక, శర్వా ఇద్దరూ తెగ నవ్వులు చిందిస్తున్నారు. ఒకరి వైపు మరొకరు చూసుకోకపోయినా ఆ నవ్వులు మాత్రం ఎన్నో విషయాలను చెబుతున్నాయి. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పండుగ వాతావరణాన్ని తలపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇళ్లంతా పూలతో అలకరించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈపోస్టర్ మాత్రం పండుగకు సరైందనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
By October 15, 2021 at 10:24AM
No comments