Radhe Shyam: పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెప్పిన 'రాధే శ్యామ్' యూనిట్.. కొత్త పోస్టర్ రిలీజ్
నేడు (అక్టోబర్ 13) అందాల తార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ '' యూనిట్. హ్యాపీ బర్త్ డే అంటూ పూజా బ్యూటిఫుల్ లుక్ విడుదల చేశారు. దీంతో ఈ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. కామెంట్ల రూపంలో పెద్ద ఎత్తున పూజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్‌గా 'రాధే శ్యామ్' రూపొందిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రేమ కథలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రభాస్, పూజా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరాయని చెప్పకనే చెప్పాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవుతాయని తెలుస్తోంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లు.. అన్నింటినీ కలిపి 'రాధే శ్యామ్' సినిమాను ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌లో రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తుండగా.. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
By October 13, 2021 at 02:16PM
No comments