Naresh - MAA: ముండ మోసిన వాళ్లలా ఎడుపులెందుకు?.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై నరేశ్ ఘాటు వ్యాఖ్యలు
‘మా’ అసోసియేషన్ ఎన్నికల తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. ముందుగా పెన్షన్స్‌కు సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చచేశారు. ఈ సందర్భంగా నరేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమోషన్స్‌తో, ఫ్రస్టేషన్స్‌తో ‘మా’ అభివృద్ధికి అడ్డుపడకండి. అధ్యక్షుడిగా ఇది నా చివరి రోజు. ఆరేళ్లు పనిచేశాను. ఇక్కడా సభ్యులు ఆనంద బాష్పాలతో వీడ్కోలు చేశారు. అవసరం అయితేనే కృష్ణుడు వస్తాడు. ఆ అవసరం రావద్దని నేను కోరుకుంటున్నాను. ఆనంద బాష్పాలతో వెళుతున్నాను. ధర్మాన్ని నెలకొల్పుతాం. ఇలాగే సంతోషం కొనసాగాలి. ఇంత పెద్ద ఎన్నికలు జరిగి విష్ణు మంచుని మా సభ్యులు గెలిపించుకున్న తర్వాత, మళ్లీ మాటలెందుకు? నరేశ్ ఏం చేశాడు? నా వల్ల ప్రకాశ్ రాజ్ రాలేదా? పోటీ చేయలేదా? ఆరోపణలెందుకు? ఇలాంటివన్నీ మానేయాలి. మా అనేది ఓ సేవా సంస్థ. ముందుకెళ్లాలంతే. ఇప్పుడు ఎన్నికైన ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని సభ్యులు రాజీనామాలు చేశారు. తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడున్న ప్యానెల్ నిర్ణయించుకుంటుంది. అయినా ఎందుకు రిజైన్ చేయాలి. రెండు సంవత్సరాలు ఓడినా, గెలిచినా కలిసి పని చేస్తామని అన్నారు కదా. మాట మీద నిలబడాలి కదా. మోదీగారు గెలిచారు.. మరి కాంగ్రెస్ వాళ్లందరూ దేశాన్ని వదిలేసి వెళ్లిపోతారా? కరెక్ట్ కాదు కదా. ఇక్కడ చూస్తే ఎవరు గెలిచారు. మా గెలిచింది. ఇక్కడ ప్యానెల్‌లో మీరు కూడా ఉన్నారు. అందరం కలిసి పనిచేద్దామనుకున్నాం. విడిపోదామని అనుకుంటే వాళ్ల ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. సభ్యులు అక్కడే ఉన్నప్పుడు ఓటింగ్ జరిగింది. ఇంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగిన తర్వాత ముండ మోసినట్లు ఎందుకు ఏడుస్తున్నారు? కొంత మంది మగవాళ్లు ఏడుస్తున్నారు. ఎందుకెడుస్తున్నారు. అతిగా ఏడ్చే మగవాడిని నమ్మకండి. ఇప్పటికీ మేం కలిసి పనిచేద్దామనే పిలుస్తున్నాం. లోపలుంటే కొడతారా? తిడతారా? పెత్తనదారీ వ్యవస్థ పోవాలి. బయట నుంచే ప్రశ్నిస్తామంటే, ఈసారి వచ్చినంత ఓట్లు కూడా నెక్ట్స్ టైమ్ రావు. ఎన్నికలు జరగకూడదనేదే మా ప్రయత్నం.
By October 13, 2021 at 01:47PM
No comments