Allu Arjun - Pushpa: ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణకు కాస్త గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ మాల్దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. అది కూడా ఫ్యామిలీతో సహా. ఇప్పుడు బన్నీ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహ తన సోషల్ మీడియాలో బన్నీ హ్యాపీ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. వారం రోజుల పాటు బన్నీ మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేయనున్నారు. వెంటనే పుష్ప షూటింగ్‌లో భాగం అవుతారు. నవంబర్ రెండో వారం లోపలే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్లాన్. ఎందుకంటే పుష్ప మూవీలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి తగ్గట్టు ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలి మరి. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. రంగ స్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా కావడంతో సినీ వర్గాలు ఆసక్తిగా పుష్ప ది రైజ్ కోసం వేచి చూస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప మూవీ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ రగ్డ్ లుక్‌లో కనిపించే పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
By October 13, 2021 at 03:06PM
No comments