Breaking News

Prakash Raj: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌లో కుట్ర.. ఇంత దిగ‌జారి గుద్దించుకుని గెలవాలా.. స్టేజ్‌పై క‌న్నీళ్లు పెట్టుకున్న ప్ర‌కాశ్‌రాజ్‌


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ సిటిజ‌న్స్ వేయాల్సిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో మంచు విష్ణు ప్యానెల్ మోసాల‌కు పాల్ప‌డిదంటూ ప్ర‌కాశ్‌రాజ్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం జ‌ర‌గిన ప్రెస్‌మీట్‌లో ఈ విష‌యాన్ని ఆయ‌న తెలియ‌జేశారు. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే.. ‘‘ఈ క‌రోనా స‌మ‌యంలో అర‌వై ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఓటింగ్‌కు రాలేక‌పోవ‌డంతో పోస్ట‌ల్ బ్యాలెట్ వేసే అవ‌కాశం ఇద్దామ‌ని అనుకున్నాం. దీనికి కొన్ని రూల్స్ పాటించాల‌ని అనుకున్నాం. ఎన్నిక‌ల అధికారులు సూచించిన రూల్స్ ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 30 తారీఖులోపు మా ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌నుకుంటున్న సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఓ లెట‌ర్ రాయాలి. అందులో వాళ్లే అడ్ర‌స్‌, మెంబ‌ర్ షిప్ నెంబ‌ర్‌ను కూడా రాయాలి. వాళ్ల అసిస్టెంట్‌ను ఒక‌రినే పంపాలి. మ‌రొక‌రి ద్వారా ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటును పంప‌కూడ‌దు. వ‌చ్చిన లెట‌ర్స్‌ను చూసుకుని అక్టోబ‌ర్ 4న ఆయా అడ్ర‌స్‌ల‌కు సీల్డ్ క‌వ‌ర్స్‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ పంపుతామ‌ని, ఓటు వేసిన పోస్ట‌ల్ బ్యాలెట్ సీల్డ్ క‌వ‌ర్‌ను తీసుకుని 9వ తారీఖు లోపు రావాలని అఅధికారులు సూచించారు. స‌రేన‌ని మేం చెన్నై, వైజాగ్ ప్రాంతాల‌కు ఫోన్ చేసినప్పుడు ఆల్ రెడీ వ‌చ్చి సంత‌కాలు తీసుకెళ్లారు సార్‌! అని అన్నారు. ఓటు వేసేవాళ్లే లెట‌ర్ రాసి పోస్ట్ చేయాల‌న్న‌ప్పుడు ప్యానెల్ త‌ర‌పు నుంచి ఒక‌రు వ‌చ్చి లెట‌ర్ తీసుకొచ్చి పోస్ట‌ల్ బ్యాలెట్ పంపుతామ‌ని తీసుకెళ్లార‌న్నారు. త‌ర్వాత 60 బ్యాలెట్ పేప‌ర్స్ వ‌చ్చాయి. మూడు స్టేట్స్ నుంచి యాబైకు పైగా ఒకేలా ఉన్నాయ‌ని ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ చెప్పారు. నిన్న పొద్దున వర‌కు ఆరేడు మంది స‌భ్యులు మాత్ర‌మే వీరిలో డ‌బ్బులు క‌ట్టి ఉన్నారు. కానీ నిన్న సాయంత్రం వ‌ర‌కు 56 మందికి చెందిన డ‌బ్బు 28000 రూపాయ‌ల‌ను ఒకే వ్య‌క్తి వ‌చ్చి క‌ట్టేసి వెళ్లాడు. అదెవ‌రో కాదు.. మోహ‌న్‌బాబు కంపెనీలో మేనేజ‌ర్ అని తెలిసింది. మీరు ఎలా క‌ట్టించుకున్నార‌ని ప్ర‌శ్నించాను. వెంట‌నే కొన్ని గంట‌ల్లో మ‌రో వ్య‌క్తి వ‌చ్చి క‌ట్టిన డ‌బ్బుల‌ను తీసుకెళ్లిపోయారు. వాటికి సంబంధించిన రిసిప్ట్ ఉన్నాయి. అన్ని ఆధారాలున్నాయి. రిట‌ర్న్ తీసుకెళ్లిన వ్య‌క్తి ఆ ప్యానెల్‌కు చెందిన చిన్నా అనే వ్య‌క్తి. ఓటు వేయాల్సిన వ్య‌క్తులే పంపాల‌ని రూల్ పెట్టుకున్నప్ప‌డు వాళ్లు మ‌నుషుల్ని పంపించుకుని లెట‌ర్స్ పంపిస్తారు. వాళ్లే డ‌బ్బులు క‌డ‌తారు. రేపు పోస్ట‌ల్ బ్యాలెట్ పంపిన త‌ర్వాత వాళ్లే వెళ్లి వాళ్ల‌కు కావాల్సిన‌ట్లు గుద్దించుకుని మ‌ళ్లీ పోస్ట్ చేయ‌ర‌ని ఏంటి గ్యారెంటి. ఇలా అస‌హ్యంగా ఎన్నిక‌లు జ‌రుపుతామా? (క‌న్నీళ్లు పెట్టుకుంటూ.. ), క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ కృష్ణంరాజుగారిని అడుగుతున్నాను. మీరు క‌ట్టాల్సిన రూ.500 కూడా ఈ లిస్టులో ఉంది. మ‌హేశ్ బాబుగారి తండ్రి డ‌బ్బు కూడా వాళ్లే క‌ట్టారు. వైజాగ్‌లో ఉన్న‌వాళ్ల డ‌బ్బులు కూడా క‌ట్టారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డబ్బులు కూడా క‌ట్టారు. ల‌క్ష్మి, శార‌ద‌గారి డ‌బ్బులు క‌ట్టారు. ఇలా దిగ‌జారి ఎన్నిక‌లు జ‌రుపుతారా? ఇలా గుద్దించుకుని వ‌స్తారా? ఈ ఓట్ల‌ను క్యాన్సిల్ చేయాల‌ని ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌ను కోరుతున్నాం. గెలిచే ముందు గుద్దించుకోవాలా? వాళ్లు క‌డితే, వీళ్లెలా తీసుకుంటార‌ని అడుగుతున్నాను. శ‌ర‌త్‌బాబుగారికి ఫోన్ చేస్తే ఆయ‌న ఐదు వంద‌ల రూపాయ‌ల‌ను మోహ‌న్‌బాబుగారికి గూగుల్ పే చేస్తాన‌ని అన్నారు. ఇది ఎన్నిక‌లు జ‌రిగే ప‌ద్ధ‌తేనా? పెద్ద‌లైన ముర‌ళీమోహ‌న్‌గారు, చిరంజీవిగారు, నాగార్జున‌గారిని అడుగుతున్నాను. మీరు ఇప్ప‌డు స‌మాధానం చెప్పండి. 60 ఏళ్ల వాళ్లను కూడా ఇలా వాడుకుంటారా’’ అన్నారు.


By October 05, 2021 at 11:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prakash-raj-sheds-tears-on-stage-about-fraud-in-postal-ballot-votes-maa-elections/articleshow/86774870.cms

No comments