Breaking News

ట్విట్టర్‌లో ఫోన్‌ అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన శృతి హాసన్


సోషల్‌మీడియా.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సమాచారం కావాలన్ని ఇప్పుడు ఇందులోనే దొరుకుతుంది. ఒకప్పుడు ఏదైన విషయం జరిగితే అది అందరికి తెలియాలి అంటే.. మరుసటి రోజు పేపర్‌ వచ్చే వరకూ వేచి చూడాలి. కానీ, ఇప్పుడు ఘటన జరిగిన వెంటనే సోషల్‌మీడియా ద్వారా క్షణాల్లో అందరికి చేరిపోతుంది. అయితే కొందరు ఈ సోషల్‌మీడియాను మంచి కోసం ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం దుర్వినియోగం చేస్తుంటారు. సెలబ్రిటీలపై అసభ్య కామెంట్లు చేయడం.. లేదా వారిని వేరే విధంగా వేధించడం జరుగుతూ ఉంటుంది. తాజాగా నటి శృతి హాసన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి ఆ తర్వాత హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్‌మీడియాలో శృతిహాసన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చాలాసార్లు అభిమానులతో చాట్ సెషన్‌ కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ ఛాట్ సెషన్‌లో కొందరు అనవసరమైన కామెంట్లు చేస్తుంటారు. అయితే రీసెంట్‌ శృతి చాట్ సెషన్‌ పెట్టింది. అయితే ఇందులో కూడా ఆమెకు ఓ అనవసరమైన కామెంట్ ఎదురుకాగా.. దానికి ధీటుగా జవాబు ఇచ్చింది ఈ భామ. చాట్ సెషన్‌లో ఓ వ్యక్తి తన ఫోన్ నెంబర్‌ ఇవ్వాలంటూ.. శృతి హాసన్‌ని కోరాడు. దీనికి సమాధానంగా ‘100’ అంటూ పోలీసుల నెంబర్ ఇచ్చి అతనికి షాక్ ఇచ్చింది శృతి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్న శృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.


By October 05, 2021 at 11:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sruthi-hassan-gives-befitting-reply-to-person-who-asked-her-phone-number/articleshow/86774743.cms

No comments