Posani Krishna Murali - Bandla Ganesh: పోసాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ద్రోహి...ఢిల్లీకి వెళ్లాను.. ఆయన చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేశ్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/86701642/photo-86701642.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలు, దానికి బదులుగా వారు చేసిన ప్రతి విమర్శలు హద్దులు దాటుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తూ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఏకంగా పోసానికి శాపాలు పెట్టాడు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘పోసానిగారు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తొలిరోజు పెట్టిన ప్రెస్‌మీట్‌లో ఆయన అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు, విబేధించాడు.. ఇదంతా బాగానే ఉంది. రెండో రోజు ప్రెస్ క్లబ్‌లో పెట్టి 83 ఏళ్ల తల్లి అంజనాదేవిగారు.. ఆమె వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నారో తెలుసా. ఆమె కడుపున పుట్టిన బిడ్డలు, వాళ్ల బిడ్డలు ఈరోజు ఎంత మందిఇ అన్నం పెడుతున్నారు సార్. ఆమె పేరు తీసుకొస్తారా! పోసానిగారికి ఒకటే నా విన్నపం. పోసానిగారి భార్య నా తల్లిలాంటిది. ఆమెకు పాదాభివందనం చేస్తాను. కానీ ఆయన తల్లుల్ని, భార్యల్ని, కూతుళ్లను తీసుకొచ్చి మాట్లాడటం సంస్కారం కాదు. నేను ఆయన గురించి మాట్లాడలేను. ఆయన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజంలో మురళిగారు కనపడితే అసహ్యించుకుంటున్నారు. నేను ఢిల్లీ వెళ్లాను. అక్కడ ఓ పదిమందిని కలిశాను. నువ్వు పర్సనల్‌గా పవన్‌కళ్యాణ్‌గారిని తిట్టు, కొట్టు..ఏమైనా అను. ధర్నా చెయ్, బంద్ చెయ్, కానీ 83 ఏళ్ల తల్లి.. మెగాస్టార్ చిరంజీవిని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ను..వాళ్ల మనవళ్లు ఎంతో మందిని ఇండస్ట్రీకి వచ్చింది. ఆమెకు పట్టుకుని అంత మాట అంటావా? భగవంతుడు అనేవాడు ఉంటే, పోసాని కృష్ణమురళి చావు ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి. పవన్‌కళ్యాణ్‌ను నీ నొటికొచ్చినట్లు, ఓపికున్నంత వరకు తిట్టుకో. ఇంట్లో వాళ్ల దగ్గరకు వెళతారా!. వాళ్లేం చేశారండి. ఆమె ఏరోజైనా మాట్లాడిందా? పోసాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ద్రోహి. ఎవరి అధికారంలో ఉంటే వారి చంకనాకుతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద పెద్దయాడ్స్ వేసి పొగిడాడు. తర్వాత చిరంజీవిగారి ప్రజారాజ్యంలో చేరి ఆయన్ని పొగిడాడు. ఈరోజు జగన్‌గారిని పొగుడుతున్నాడు’’ అన్నారు.
By October 02, 2021 at 11:57AM
No comments