Breaking News

Maharashtra ఆచూకీలేని ముంబయి మాజీ సీపీ.. రష్యాకు పారిపోయారా?


పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రష్యాకు పారిపోయినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలే ఆయనను దేశం దాటించారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘సచిన్ వాజే ఎపిసోడ్ జరిగినప్పుడు నేను ప్రభుత్వంలో ఉంటే ముందుగా పరమ్ బీర్ సింగ్‌ను అరెస్టు చేస్తానని చెప్పాను.. దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేంద్రం ఈ ఐపీఎస్ అధికారిని పావుగా వాడకుంది.. అందుకే వారు పరమ్ బీర్ సింగ్ తప్పించుకుని విదేశాలకు పారిపోవడానికి సహాయం చేశారు’ అని ధ్వజమెత్తారు. ‘పరమ్ బీర్ సింగ్ ఒక లేఖ రాసి, రూ.100 కోట్ల దోపిడీ ఆరోపణలను తెరపైకి తెచ్చినప్పుడు.. పోరాటం ప్రారంభమైంది. పరమ్ బీర్ సింగ్ తన రాజకీయ ఉన్నతాధికారుల పేరు చెప్పకుండా ఉండటానికి అతడిని వారే విదేశాలకు పంపారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ ఎదురు దాడి చేశారు. కాగా, పరంబీర్ సింగ్ కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారని మహరాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ పేర్కొన్నారు. ఆయనపై ఉన్న అభియోగాల విచారణ కోసం ఏర్పాటు చేసిన చందీవాల్‌ కమిషన్‌ ఎదుట హాజరు కావాలని లుకౌట్‌ నోటీసులు కూడా జారీచేశామని చెప్పారు. ‘ఒకవేళ పరంబీర్‌ గనుక దేశం నుంచి వెళ్లిపోతే.. అది ఎంతమాత్రం మంచిది కాదు.. మంత్రి అయినా, సీనియర్‌ అధికారి అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం కోసం పనిచేసే వారు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా వీళ్లు దేశం నుంచి విడిచి వెళ్లకూడదని, ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. పరంబీర్‌పై ఏవిధమైన చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ప్రశ్నక మంత్రి పాటిల్‌ స్పందిస్తూ.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి ఆయన కోసం వెతుకుతున్నామని, గుర్తించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.


By October 02, 2021 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/words-war-between-congress-and-bjp-over-mumbai-ex-top-cops-escape-to-russia/articleshow/86700855.cms

No comments