Breaking News

Pawan Kalyan: రజనీకాంత్, కమల్ హాసన్‌లపై నమ్మకం లేదు.. పవన్‌ కోసం వెయిటింగ్: ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు


2020 నవంబర్.. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్‌ ఓ ఊసరవెల్లి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన పార్టీ ఎందుకు పెట్టినట్టో చెప్పాలంటూ గట్టిగానే ప్రశ్నించారు. అయితే ఈ తరువాత ఈ గొడవలన్నీ పక్కనపెట్టేసి.. ‘వకీల్ సాబ్’లో పోటాపోటీగా వాదనలు వినిపించి బొమ్మ రక్తికట్టించారు. రీసెంట్‌గా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కి మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకూ దూరం దూరంగా ఉన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌లు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించి.. అతనో ఊసరవెల్లి అని వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ మార్పు చెందిన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ మార్పు ఏంటో అతని మాటల్లోనే చూద్దాం. పవన్ కళ్యాణ్ చాలా మార్పు చెందాడు.. గతంలో విమర్శించొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. జనం మెచ్చిన లీడర్ కావాలని అనుకోవడం నాకు బాగా నచ్చింది. నేను బాగా ఇష్టపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టే.. ఆయన నిర్ణయాలు నాకు నచ్చకపోతే వెంటనే చెప్పేస్తా. ఆయన్ని ద్వేషించడం లేదు.. హర్టింగ్‌గా అనిపిస్తుంది అంతే. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయనకు ఉండే కారణాలు ఆయనకి ఉండొచ్చు. కానీ నేను ఇష్టపడే లీడర్ నచ్చని పని చేస్తే చెప్పే హక్కు నాకు ఉంటుంది. నచ్చలేదని చెప్పడం ద్వేషించడం కాదు.. ప్రేమిస్తున్నాను కాబట్టి.. పవన్ కళ్యాణ్‌ గురించి అప్పట్లో అలా మాట్లాడాల్సి వచ్చింది. నాయన మంచి లీడర్‌గా ఎదగాలని నేను ఎదురుచూస్తున్నా.. ఆయన కూడా గొప్ప మనసుతో మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.. వాటిని స్వీకరిస్తాను.. నటన దారి నటనదే.. ప్రకాష్ రాజ్ గ్రేట్ యాక్టర్ ఆయనతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. ఆయన లేకపోతే ఈ సినిమాలో నేను ఇంత బాగా యాక్ట్ చేయలేను అని పవన్ కళ్యాణ్ నా గురించి చెప్పడం ఎంత గొప్పతనమో చూడండి. భిన్నాభిప్రాయాలతో ఒకర్నొకరు అర్ధం చేసుకుంటూ.. మాట్లాడే హక్కు ఇస్తూ బతికే బతుకునే కోరుకుంటాం. అలాంటి సమాజం కోసమే మనం ప్రయత్నించాలి. పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి అయ్యాడు.. నేను నిజాయితీగా ఉన్నా. ఆయన కూడా నిజాయితీగా ఉన్నాడు కాబట్టే మా మధ్య ప్రాబ్లమ్స్ రాలేదు అని చెప్పారు ప్రకాష్ రాజ్. ఇక తమిళ రాజకీయాల్లో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలసి పనిచేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు ప్రకాష్ రాజ్. ‘ఎంజీఆర్, జయలలితలు పద్దతిగానే పనిచేశారు.. పొలిటికల్ ఇన్నింగ్స్ అనేసరికి.. నాతో పనిచేశారని చెప్పి వాళ్లకి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సిద్ధాంతాలు నాకు ముఖ్యం. అసలు వాళ్లపై నాకు నమ్మకం లేదు. జనానికి చేస్తారో లేదో నమ్మకం లేదు. బెంగుళూరు సెంట్రల్ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో నేనూ పోటీ చేశా. నా సిద్ధాంతాలు ఏంటో జనానికి చెప్పాను. కానీ అవి జనానికి నచ్చలేదు. కాంగ్రెస్ట్, బీజేపీలకు చెరో నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి. నాకు 30 ఓట్లే వచ్చాయి. బట్ ప్రయత్నం అయితే చేశాను. ప్రయత్నంలో విఫలం అవ్వకూడదు. గెలిచావా? ఓడిపోయావా? అంటే.. నేను ఓడిపోలేదనే చెప్పాను. పొలిటికల్ అనేసరికి దేశం ముఖ్యంగా.. వ్యక్తిగతం కాదు. నేను పెద్దాయన (మోడీ)కి వ్యతిరేకంగా వెళ్లడం లేదు.. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నా.. రజనీకాంత్ గారి కాన్సెప్ట్ కూడా నాకు నమ్మకంగా అనిపించలేదు. నేను వ్యతిరేకిస్తున్న బీజేపీతో వీళ్లు పోరాడతారనే నమ్మకం.. ఎదురించడానికి సరిపడే బలం వీళ్ల దగ్గర లేదు. అందులో వాళ్లతో లేదు. నాకు తెలిసిన వ్యక్తులు కాదు.. దేశం ముఖ్యం.. నమ్మకున్న సిద్ధాంతాలు ముఖ్యం. అలాగని వాళ్లతో విబేధాలు ఉన్నాయని కాదు.. సినిమాల పరంగా రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసే వర్క్ చేస్తున్నా.. రాజకీయం వేరు.. సినిమా వేరు’ అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.


By October 26, 2021 at 02:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prakash-raj-interesting-comments-on-pawan-kalyan-political-journey/articleshow/87276033.cms

No comments