Breaking News

NTR - EMK: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు బై బైచెప్పేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. ఇటు ఓటీటీలో బిగ్ బాస్ తొలి సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అలాగే రీసెంట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌పై కూడా అడుగుపెట్టి అల‌రిస్తున్నారు. ఒక‌వైపు సినీ సెల‌బ్రిటీలు, మ‌రోవైపు సామాన్యుల‌తో ఈ ప్రోగ్రామ్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తూ వ‌చ్చారు. తాజా స‌మాచారం మేర‌కు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు సీజ‌న్ 1కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను ఎన్టీఆర్ పూర్తి చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ త‌న స్నేహితుడు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి స్టార్స్ సంద‌డి చేశారు. త్వ‌ర‌లోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా రాబోతున్నాయి. అయితే అన్నీ ఎపిసోడ్స్‌ను ఎన్టీఆర్ పూర్తి చేశాడ‌ట. దాదాపు మొత్తం 60 ఎపిసోడ్స్‌ కోసం ఎన్టీఆర్ రూ.7.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే,త్వ‌ర‌లోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమా కోసం ఎన్టీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అలాగే మరో వైపు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలో తెలంగాణ గోండువీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ మెప్పించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


By October 19, 2021 at 07:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-tiger-ntr-has-completed-his-shooting-part-for-evaru-meelo-koteeswarulu/articleshow/87126583.cms

No comments